This Week OTT Releases: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ‘డంకీ’ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, ‘నా సామిరంగ’, ‘కేరళ స్టోరీ’ సహా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
![This Week OTT Releases: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే! This week February 3rd week ott release movies This Week OTT Releases: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/8fd48df880ff0fabdd4fc789d63255211707985301103544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
This Week OTT Releases: గత వారం ‘ఈగల్’, ‘లాల్ సలామ్’ లాంటి చిత్రాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన ‘భైరవకోన’ విడుదల కానుంది.
ఇప్పటికే ‘గుంటూరుకారం’, ‘సైంధవ్’, ‘కెప్టెన్ మిల్లర్’ లాంటి సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టగా, ఈ వారం అక్కినేని నాగార్జున మూవీ ‘నా సామిరంగ’ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గత ఏడాది మేలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రం సుమారు 9 నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయబోతోంది. ‘డంకీ’, ‘సబా నాయగన్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా ఈ వారం 20కి పైగా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీల్లో ఏయే సినిమాతలమల యలోలంలయలు రాబోతున్నయో ఇప్పుడు తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్
1. డంకీ- స్ట్రీమింగ్ అవుతోంది.
2. హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్)- ఫిబ్రవరి 15
3. ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్ 2(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
4. లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్)- ఫిబ్రవరి 15
5. రెడీ సెట్ లవ్ (వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15
6. ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15
7. ది క్యాచర్ వాజ్ ఏ స్పై- ఫిబ్రవరి 15
8. క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 15
9. ది అబిస్(మూవీ)- ఫిబ్రవరి 16
10. కామెడీ చావోస్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 16
11. ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం)- ఫిబ్రవరి 16
12. ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 16
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
1. నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17
2. సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది.
3. సలార్ (హిందీ వర్షన్)- ఫిబ్రవరి 16
4. ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- ఫిబ్రవరి 16
View this post on Instagram
అమెజాన్ ప్రైమ్ వీడియో
1. రూట్ నం.17 ( తమిళ్ మూవీ)- ఫిబ్రవరి 15
2. అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16
3. లవ్‌స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్)- స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
1. ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16
2. క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది
View this post on Instagram
Read Also: రవితేజపై ప్రియమణి కామెంట్స్ - మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)