అన్వేషించండి

Priyamani - Ravi Teja: రవితేజపై ప్రియమణి కామెంట్స్ - మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

సౌత్ స్టార్ బ్యూటీ ప్రియమణి రవితేజ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తన ఫేవరెట్ కో స్టార్ అని చెప్పింది. తను నటించి ప్రతి సినిమా తప్పకుండా చూస్తానని వెల్లడించింది.

Actress Priyamani About Ravi Teja: సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’. 2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ మూవీ కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ‘భామా కలాపం 2’ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

రవితేజ నా ఫేవరెట్ కో స్టార్- ప్రియమణి

‘భామా కలాపం 2’  సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రియమణి, మాస్ మహారాజా రవితేజ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆయనతో కలిసి యాక్షన్ సినిమాలో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది. “చాలా కాలం క్రితం ఇద్దరం కలిసి ఓ సినిమా చేశాం. దాని పేరు ‘శంభోశివశంభో‘. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలవలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కలిశాం.. రవితేజకు సంబంధించిన అన్ని సినిమాలను చూశాను. మిస్ కాను. అయితే, థియేటర్లలో చూసే అవకాశం రాలేదు. ఓటీటీలో చూస్తున్నాను. ఆయన నా ఫేవరెట్ కో స్టార్. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నాడో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఆన్ కెమెరాలో ఎలా ఉంటారో? ఆఫ్ కెమెరాలోనూ అలాగే ఉంటారు. ఇప్పటి వరకు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నేను కూడా ఇప్పుడిప్పుడే యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్షన్ సినిమా చేద్దాం?” అని రవితేజను అడిగింది.

కార్తీక్ ఘట్టమనేనితో చేద్దాం- రవితేజ

అటు ప్రియమణి ప్రశ్నకు రవితేజ ఆసక్తికర సమాధానం చెప్పారు. “ప్రస్తుతం యాక్షన్ మూవీస్ లో విపరీమైన కమాండ్ ఉన్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. చక్కటి సినిమాలతో  మంచి పేరు వచ్చింది. చాలా మంది ఆయనను మెచ్చుకుంటున్నారు. అతడే మన యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఐడియా కార్తీక్ ఆలోచించండి” అన్నారు రవితేజ.

‘భామాకలాపం 2’లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదార్‌ ఈ సినిమాను నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. అటు ప్రియమణి నటించిన ‘భామ కలాపం’ సినిమా కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమాను సైతం అభిమన్యు తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సత్తా చాటింది.

Read Also: ఇది నాకు ఇష్టమైన వివాదం - అనసూయ

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget