2024 Summer Movies: సమ్మర్‌లో చిన్న, మీడియం రేంజ్ హీరోల సందడి - మండుటెండల్లో హిట్టు కొట్టేదెవరో?
Summer Movies: 2024 సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న, మీడియం రేంజ్ హీరోలంతా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. వారం వారం కొత్త చిత్రాలను అందించడానికి రెడీ అయ్యారు.
2024 Summer Movies: సమ్మర్ అంటే సినిమాలకు లాంగ్ రన్ ఉండే మంచి సీజన్ గా భావిస్తుంటారు. ఆ సమయంలో స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉంటాయి కాబట్టి, ఫ్యామిలీలను థియేటర్లకు రప్పించవచ్చు. అందుకే వేసవిలో ప్రతీ వారం గ్యాప్ లేకుండా క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. మార్చి నెలాఖరు నుంచి మొదలుపెట్టి, జూన్ రెండో వారం వరకూ సినిమాల సందడి కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది సమ్మర్ లో పెద్ద చిత్రాల రిలేజులేమీ లేవు. దీంతో చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాలన్నీ వరుసగా థియేటర్లకు క్యూ కడుతున్నాయి. మండుటెండలను క్యాష్ చేసుకోవడానికి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఓం భీమ్ బుష్
గతేడాది 'సామజవరగమన' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు... ఇప్పుడు 'ఓం భీమ్ బుష్' సినిమాతో సమ్మర్ సీజన్ ను సానుకూలంగా ప్రారంభించారు. శుక్రవారం (మార్చి 22) గ్రాండ్ రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. రెండు రోజుల్లో రూ. 10.44 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రెండ్ చూస్తుంటే మొదటి వారాంతంలో డీసెంట్ కలెక్షన్లు గ్యారంటీ అని అర్థమవుతోంది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పించారు. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
టిల్లు స్క్వేర్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఇది 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డబుల్ ఫన్, డబుల్ మ్యాడ్ నెస్ అందించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఫ్యామిలీ స్టార్
సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: ‘టిల్లు స్క్వేర్’ - అందరూ ఇది 'పెద్దలకు మాత్రమే' అనుకున్నారు కానీ!
ఆ ఒక్కటీ అడక్కు
అల్లరి నరేష్ చాలా గ్యాప్ తర్వాత తన ఫేవరేట్ కామెడీ జోనర్ లో తీసిన సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. రాజీవ్ చిలక దీనికి నిర్మాత. ఈ మధ్య వచ్చిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ముందుగా ఈ మూవీని మార్చి 22న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావించారు. కానీ లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
గీతాంజలి మళ్లీ వచ్చింది
అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న హారర్ కామెడీ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఇది ఆమె కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం. 2014లో వచ్చిన 'గీతాంజలి' సినిమాకి సీక్వెల్. రచయిత కోన వెంకట్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, 'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు, పాటలు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
ప్రసన్న వదనం
ఇటీవల 'అంబానీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో హిట్టు కొట్టిన సుహాస్... 'ప్రసన్న వదనం' చిత్రంతో పలకరించడానికి రెడీ అయ్యారు. ఈ మూవీ మే 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో పాటుగా దిల్ రాజు ప్రొడక్షన్ లో సుహాస్ నటిస్తున్న సినిమా కూడా ఈ సమ్మర్ కే విడుదల అవుతుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీని మే 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ మధ్యనే మేకర్స్ ప్రకటించారు.
Also Read: అప్పుడు శ్రీ లక్ష్మి, ఇప్పుడు ఆరాధ్య దేవి - అలా ఉన్న శారీ పాపని ఆర్జీవీ ఎలా మార్చేసాడో చూశారా?