అన్వేషించండి

Ram Gopal Varma: అప్పుడు శ్రీ లక్ష్మి, ఇప్పుడు ఆరాధ్య దేవి - అలా ఉన్న శారీ పాపని ఆర్జీవీ ఎలా మార్చేసాడో చూశారా?

Ram Gopal Varma: ఇటీవల కేరళ కుట్టి శ్రీ లక్ష్మీ సతీష్ ను సోషల్ మీడియాలో పాపులర్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఆమెతో 'శారీ' అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ ఆమెకు సరికొత్త నామకరణం చేసారు.

Ram Gopal Varma: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా తన పబ్లిసిటీ కోసమే చేస్తారు. అప్పుడప్పుడు పక్కనోళ్ళకు కూడా ప్రచారం కల్పిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆర్జీవీ.. తనకు నచ్చిన అమ్మాయిల గురించి, తనను ఆకర్షించిన ముద్దుగుమ్మల గురించి పోస్టులు పెట్టడం మనం చూసాం. ఆయన మెప్పుపొంది ఫేమస్ అయిన లేడీస్ చాలా మందే ఉన్నారు. అప్సర రాణి, శ్రీ రాపాక, ఇనయ సుల్తానా, అషూ రెడ్డి, అరియానా గ్లోరీ లాంటి వారు వర్మ వల్లనే లైమ్ లైట్‌లోకి వచ్చి, ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ విధంగా వెలుగులోకి వచ్చింది శారీ సుందరి శ్రీ లక్ష్మీ సతీష్. 

కొద్దిరోజుల క్రితం చీర కట్టుతో రీల్స్ చేసిన ఓ అమ్మాయి వీడియోలను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో తెగ షేర్ చేసిన సంగతి తెలిసిందే. శారీలో కనిపించి కనిపించని నడుమ అందాలను ప్రదర్శిస్తూ, ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఆ బ్యూటీ ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్లను కోరాడు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటో షూట్స్ చేసిన ఆమె వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించిన దర్శకుడు.. చివరకు ఆమె కేరళ కుట్టి శ్రీ లక్ష్మీ సతీష్ అని తెలుసుకున్నారు. వెంటనే ఆర్జీవీ డెన్ కు పిలిపించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె వీడియోలు, ఫోటోలు షేర్ చేసి 'శారీ' (SAAREE) అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ మెచ్చిన బ్యూటీ శారీ సుందరి శ్రీ లక్ష్మీ సతీష్ పేరు మారిపోయింది. ఆమెకు ఆర్జీవీ సరికొత్త నామకరణం చేశారు. 'ఆరాధ్య దేవి'గా స్క్రీన్ నేమ్ మార్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ''శారీ చిత్రంలో నటించిన తర్వాత ఆమె ఇప్పుడు ఆరాధ్య దేవిగా మారింది'' అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన వర్మ.. ఆమె లేటెస్ట్ రీల్ ను పంచుకున్నారు. ''హే ఆరాధ్యాదేవి.. మీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను నమ్మలేకపోతున్నాను. నాకు వర్షం అంటే ఇష్టం ఉండదు.. కానీ వర్షంలో నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను'' అని ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

ఆరాధ్య దేవిగా మారిన తర్వాత శ్రీ లక్ష్మీ షేర్ చేసిన ఫస్ట్ రీల్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. అలా పేరు మారిందో లేదో.. వెంటనే ఆమె కట్టూ బొట్టు అంతా మారిపోయాయి. గతంలో చీర కట్టుతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ఈ శారీ సుందరి.. ఇప్పుడు ఎక్స్పోజింగ్ తో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వర్షంలో తడుస్తూ ఆమె చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అలా ఉన్న శారీ పాపని ఆర్జీవీ ఎలా మార్చేసాడో చూశారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా పరిచయం అవుతోంది కాబట్టి, ఇలాంటి హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ చెయ్యాలనే విషయం వర్మ బోధించి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

రామ్ గోపాల్ వర్మ గతంలో 'నగ్నం' సినిమా కోసం శ్రీ రాపాక ని 'స్వీటీ'గా పరిచయం చేసారు. అలానే ఒడిశాకు చెందిన బ్యూటీని 'అప్సర రాణి' గా మార్చి 'థ్రిల్లర్', 'డేంజరస్' వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు 'శారీ' మూవీతో శ్రీ లక్ష్మి సతీష్ ను ఆరాధ్య దేవిగా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్నారు. శ్రీ లక్ష్మి ఫొటోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ లో తెరకెక్కతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా రిలీజ్ అయింది. 

Also Read: ‘టిల్లు స్క్వేర్’ సెన్సార్ - అందరూ ఇది 'పెద్దలకు మాత్రమే' అనుకున్నారు కానీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget