యువ దర్శకుడు వశిష్ఠ మల్లిడి నందమూరి మోక్షజ్ఞ తేజ తొలి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ ఆయన చెప్పిన కథకు అంగీకరించారు.
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Nandamuri Mokshagna Debut Movie: నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ త్వరలో వెండితెరపై అడుగు పెట్టబోతున్నారని సమాచారం. ప్రశాంత్ వర్మ కాకుండా... మరో దర్శకుడితో సినిమా చేయనున్నారని టాక్.

- మోక్షజ్ఞ తెరంగేట్రానికి ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ గతంలో రద్దయ్యింది.
- 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ మల్లిడి కథకు బాలకృష్ణ ఓటేశారు.
- విజయదశమికి ఈ చిత్రం పూజతో లాంఛనంగా ప్రారంభం కానుంది.
- బాలకృష్ణ గాయంతో ప్రకటన ఆలస్యమైనా, త్వరలో అధికారికం.
నందమూరి వారసుడు, గాడ్ ఆఫ్ మాసెస్ - నట సింహం బాలకృష్ణ (Balakrishna Son Mokshagna) తనయుడు మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం కోసం అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా హిట్ 'హను-మాన్' తర్వాత నందమూరి వారసుడిని కథానాయకుడిగా పరిచయం చేసేందుకు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందుకు వచ్చారు. ఆ బాధ్యత తీసుకున్నారు. తెల్లవారితే సినిమా ఓపెనింగ్ అనగా ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆ సినిమా పూజ ఎందుకు ఆగింది? అనేది ఇప్పటికీ బయటకు రాలేదు. కట్ చేస్తే... ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేసేందుకు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) రెడీ అయినట్టు తెలిసింది.
వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో మోక్షజ్ఞ!?
Mallidi Vassishta To Direct Nandamuri Mokshagna: యువ దర్శకుడు వశిష్ఠ మల్లిడి చెప్పిన కథకు నందమూరి బాలకృష్ణ ఓటు వేశారని టాలీవుడ్ టాక్. మరి ఆ కథ ఏ జానర్? హీరో క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Also Read: Balakrishna - డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'బింబిసార'తో వశిష్ఠ మల్లిడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'విశ్వంభర' తీశారు. విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడకూడదని, క్వాలిటీ ప్రోడక్ట్ ప్రేక్షకులకు అందించాలని అనుకోవడంతో ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఆ సినిమా విడుదలకు ముందు మరో సినిమాను, అదీ నందమూరి మోక్షజ్ఞ తేజ పరిచయ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అయ్యారు వశిష్ఠ మల్లిడి.
Also Read: Prabhas - ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
View this post on Instagram
దసరాకు పూజతో సినిమా ప్రారంభం?
Nandamuri Mokshagna Debut Movie Launch: నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించనున్న సినిమాను విజయ దశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిసింది. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్టు టాక్. ఈ సినిమాను అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. బాలకృష్ణ మోకాలికి గాయం కావడం, సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా అనౌన్స్‌మెంట్ లేట్ అయ్యిందట.
Also Read: NTR Trivikram Movie Title - గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Frequently Asked Questions
మోక్షజ్ఞ తేజ తొలి సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు?
మోక్షజ్ఞ తేజ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది?
విజయ దశమికి పూజా కార్యక్రమాలతో మోక్షజ్ఞ తేజ తొలి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని తెలిసింది.
మోక్షజ్ఞ తేజ తొలి సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?
బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్.
మోక్షజ్ఞ తేజ తొలి సినిమా ప్రకటన ఎందుకు ఆలస్యం అయ్యింది?
బాలకృష్ణ మోకాలికి గాయం కావడం, సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా అనౌన్స్‌మెంట్ ఆలస్యం అయ్యిందని తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు





















