అన్వేషించండి

Bigg Boss Telugu season 8 episode 61: యష్మిని టార్గెట్ చేసిన నిఖిల్... చిన్న పిల్లల్లా మారిన అవినాష్, ప్రేరణ - స్టామినా లేదంటూ ఏడ్చిన టేస్టీ తేజా

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 61 తాజాగా స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులోని హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 61 మొదలవుతూనే లాస్ట్ ఎపిసోడ్ లో పెట్టిన టాస్క్ గురించి చర్చ నడిచింది. యాపిల్ ను దాచి పెట్టింది అంటూ జరిగిన గొడవ గురించి ప్రేరణతో మాట్లాడుతూ తనను తాను సమర్థించుకుంది యష్మి గౌడ. మరోవైపు సంచాలక్  గా పృథ్వీ తీసుకున్న నిర్ణయాన్ని నిఖిల్ తప్పుపట్టారు. విష్ణు ప్రియ, నయని, నిఖిల్ మధ్య డిస్కషన్ జరగ్గా ప్రేరణ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నిఖిల్. తరువాత నిఖిల్ యష్మిని కూల్.చేసే పని పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి పిల్లో ఫైట్ చేసుకున్నారు. ఉదయాన్నే మళ్ళీ నిఖిల్, యష్మి మధ్య గొడవ జరిగింది. గేమ్ లో ఆడకుండా ఏడ్చింది అంటూ నిఖిల్ వెక్కిరించడంతో యష్మి ఫైర్ అయ్యింది. 'ప్రేరణ హార్ట్ ఫుల్ గా సారీ చెప్పలేదు' అంటూ నిఖిల్ అన్నాడని కంప్లైంట్ చేశారు యష్మి గౌడ, పృథ్వి. అంత యాటిట్యూడ్ ఉంటే ఏం చేయలేమంటూ ప్రేరణ లైట్ తీసుకుంది. ఆ తరువాత ప్రేరణ, నిఖిల్ ఇద్దరూ తమ మధ్య వచ్చిన మనస్పర్ధల గురించి మాట్లాడుకున్నారు. అయితే అంతలోనే టైం అయిపోవడంతో బిగ్ బాస్ గ్యాస్ ఆఫ్ చేశారు. దీంతో మధ్యలోనే వంట ఆగిపోయింది. 

వంట గ్యాస్ ని పొందడానికి అవినాష్ రోహిణిలు చిన్నపిల్లలుగా మారాలని కొత్త టాస్క్ ని పెట్టారు బిగ్ బాస్. మిగిలిన ఇంటి సభ్యులు అంతా కలిసి వాళ్ళు అడిగినవి కాదనకుండా ఇస్తూ వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి, ఇది ఎంటర్టైనింగ్ గా ఉండాలి అని ఆదేశించారు. దీంతో అవినాష్, రోహిణి నిజంగానే చిన్నపిల్లల్లా మారిపోయారు. మొత్తానికి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూసి సంతోష పడిన బిగ్ బాస్ కిచెన్ టైమర్ కి టైం యాడ్ చేయడంతో పాటు చిన్న పిల్లలకు ఇష్టమైన ఐస్క్రీమ్ ని కూడా పంపించారు. టాస్క్ తర్వాత "నువ్వు ఎందుకు రోహిణి, అవినాష్ వాళ్ళ వెనకాలే ఉంటావు? నీకు ఇండివిడ్యువాలిటీ లేదా? అని విష్ణు ప్రియ తేజాను అనడం కరెక్ట్ కాదు కదా.. హార్ట్ అవుతారు కదా" అంటూ కామెంట్ చేసింది రోహిణి. టేస్టీ తేజాను వెళ్లి మాట్లాడమంటూ పుల్ల పెట్టింది. అంతలోనే బెడ్రూంలోకి వచ్చిన విష్ణు ప్రియ రోహిణి అవినాష్ ల వల్ల ప్రతిసారి తాము కడుపునిండా భోజనం చేయగలుగుతున్నామంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత టాస్క్ లో తాను అన్న మాటలకు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించలంటూ సారీ చెప్పింది. అయితే తేజాకు మాత్రం సారీ చెప్పకుండా తాను అందరి పర్సెప్షన్ చెప్పాను అంటూ సమర్ధించుకుంది. 

బిగ్ బాస్ చివరగా 'తాడో పేడో' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఒకవైపు ఉన్న లక్కీ బాక్స్ ని వివిధ స్థలాల్లో ఉన్న చిన్న చిన్న తాళ్లతో తాడును చేసి, దాని సహాయంతో లక్కీ బాక్స్ ని లాక్కోవాలి. ఏ టీం అయితే ముందుగా లక్కీ బాక్స్ ను తమ బాక్స్ లోకి లాక్కుంటుందో వాళ్ళే విన్నర్ అయినట్టు అని చెప్పారు బిగ్ బాస్. ఆ టీం సభ్యులకి రెండు ఎల్లో కార్డులను ఇవ్వడంతో పాటు రెండుసార్లు డైస్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఈ టాస్క్ లో నిఖిల్ విన్నయ్యాడు. బ్లూ టీం తమకు వచ్చిన రెండు యెల్లో కార్డులలో ఒక కార్డుని రెడ్ టీం కి, మరో కార్డుని గ్రీన్ టీంకి ఇచ్చింది. దీంతో రెడ్ టీం లోంచి గౌతమ్, గ్రీన్ టీం లో నుంచి విష్ణుప్రియ గేమ్ నుంచి అవుట్ అయ్యారు.

'బీబీ ఇంటికి దారేది టాస్క్ ఇంతటితో పూర్తయింది. ఈ టాస్క్ లో బీబీ ఇంటికి దగ్గరగా చేరి మెగా చీఫ్ కంటెండర్స్ గా ఎంపికైన సభ్యులు హరితేజ, నిఖిల్, అవినాష్, నబిల్, టేస్టీ తేజ' అని ప్రకటించారు బిగ్ బాస్. ఆ తర్వాత పృథ్వి దగ్గరకు వెళ్ళి యష్మి గౌడ తను తీసుకున్న డెసిషన్ స్టుపిడ్ అని అనిపించొచ్చు కానీ తన వరకు కరెక్ట్ అంటూ గౌతమ్ ను గేమ్ నుంచి తప్పించడం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చివరగా ఎవరి బ్యాగ్స్ ను వాళ్ళు సేవ్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ చీఫ్ టాస్క్ ను పెట్టారు. ఫస్ట్ రౌండ్లో అందరూ టార్గెట్ చేయడంతో హరితేజ, సెకండ్ రౌండ్లో కింద పడుతూ పడుతూ గట్టిగానే ఆడినప్పటికీ టేస్టీ తేజాను నిఖిల్, ప్రేరణ టార్గెట్ చేసి మరి అవుట్ చేశారు. కొంచెం స్టామినా ఉంటే బాగుండేది అంటూ టేస్టీ తేజా ఎమోషనల్ అయ్యాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ అతన్ని ఓదార్చారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. 

Read Also : Bigg Boss 8 Telugu 8 Day 59: 3 టాస్క్ లు, 6 గొడవలు- లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్- యష్మి గౌడ కోసం నిఖిల్ కంటతడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget