అన్వేషించండి

Stock Market News: ఈ రోజు షేర్లు కొనడం, అమ్మడం కుదరదు - స్టాక్‌ మార్కెట్లు పని చేయవు

Share Markets: సాయంత్రం 5:00 గంటల నుంచి ఈవెనింగ్‌ సెషన్ కోసం ఓపెన్‌ అవుతుంది.

Diwali Holiday to Stock Market: దీపావళి-బలిప్రతిపాద కారణంగా ఈ రోజు (మంగళవారం, 14 నవంబర్‌ 2023) స్టాక్ మార్కెట్లు పని చేయవు. 2023 స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం ఈ రోజు BSE, NSEకి సెలవు. ఈ ప్రకారం, ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్‌, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఇంట్రస్ట్‌ రేట్‌ డెరివేటివ్స్ సెగ్మెంట్‌ సహా అన్ని సెగ్మెంట్లు మూతబడతాయి. 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా మొదటి సెషన్‌లో పని చేయదు. అయితే, సాయంత్రం 5:00 గంటల నుంచి ఈవెనింగ్‌ సెషన్ కోసం ఓపెన్‌ అవుతుంది. ఈ రోజు ట్రేడ్ సెటిల్మెంట్లు కూడా ఉండవు.

శని, ఆదివారాల్లోని సాధారణ సెలవులు కాకుండా.. నవంబర్‌ నెలలో మార్కెట్‌లకు వచ్చిన మొదటి హాలిడే ఇది. గురునానక్ జయంతి సందర్భంగా ఈ నెల 27న (సోమవారం) మరొక హాలిడే ఉంటుంది. డిసెంబర్ నెలలో, క్రిస్మస్ సందర్భంగా 25వ తేదీన మార్కెట్‌ క్లోజ్‌ అవుతుంది.

లాభాల బుకింగ్
నవంబర్ 12న, ఆదివారం నాటి దీపావళి ముహూరత్‌ ట్రేడింగ్‌ మంచి ఊపుతో ముగిస్తే.. నిన్నటి (సోమవారం) సెషన్‌ పెట్టుబడిదార్లను తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు క్షీణించడంతో మార్కెట్లు నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 325 పాయింట్ల పతనంతో 64,934 పాయింట్ల వద్ద; NSE నిఫ్టీ 82 పాయింట్ల పతనంతో 19,443 పాయింట్ల వద్ద ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ 105 పాయింట్లు పతనమై 43,891 స్థాయికి పడిపోయింది. మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 27 పాయింట్లు పెరిగి 41,010 వద్దకు చేరుకుంది.

సెక్టార్ల వారీ పరిస్థితి
సోమవారం ట్రేడింగ్‌లో... బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఇన్‌ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇంధనం, లోహ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ గ్రీన్‌లో క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 7 స్టాక్స్ మాత్రం లాభాలతో రోజును ముగించగా, మిగిలిన 23 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో ఎండ్‌ అయ్యాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లోని 14 స్టాక్స్ పెరగగా, మిగిలిన 36 స్టాక్స్‌ రెడ్‌ మార్క్‌లో ఉన్నాయి.

నిన్నటి ట్రేడ్‌లో... మహీంద్ర అండ్ మహీంద్ర 0.90 శాతం, JSW స్టీల్ 0.56 శాతం, NTPC 0.43 శాతం, పవర్ గ్రిడ్ 0.38 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.21 శాతం, టాటా స్టీల్ 0.08 శాతం, SBI 0.03 శాతం పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ 1.32 శాతం, ఇన్ఫోసిస్ 1 శాతం, టెక్ మహీంద్ర 0.96 శాతం, ICICI బ్యాంక్ 0.80 శాతం, TCS 0.79 శాతం, నెస్లే 0.79 శాతం పతనం అయ్యాయి.

స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా, BSEలో లిస్టయిన మొత్తం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.322.08 లక్షల కోట్లకు తగ్గింది. సోమవారం, BSEలో 3,975 షేర్లు ట్రేడ్ అవగా, వాటిలో 1,739 షేర్లు లాభాలతో, 2,087 నష్టాల్లో ముగిశాయి. 149 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: కొన్ని కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్‌ చేసిన సర్కారు, వీళ్ల తిప్పలు మామూలుగా ఉండవు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Embed widget