Kiran Abbavaram: 50 కోట్ల హిట్ 'క' తర్వాత ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్న కిరణ్ అబ్బవరం - 'దిల్ రూబా' టీజర్ చూశారా?
Dilruba Teaser: కిరణ్ అబ్బవరం 'క' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా 'దిల్ రూబా'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూశారా?
Kiran Abbavaram New Movie: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. మొదటి సినిమా 'రాజా వారు రాణీ గారు', ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో హిట్స్ వచ్చినా తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. అయితే... 'క' సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. తెలుగులో ఆ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసింది. అటువంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన సినిమా 'దిల్ రూబా'.
లవ్‌లో ఫెయిలైన హీరో... అర్జున్ రెడ్డి రేంజ్‌లో!?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కొత్త 'దిల్ రూబా' (Dilruba Movie). ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ ప్రొడక్షన్ హౌస్ 'ఏ యూడ్లీ ఫిలిం' సంస్థలపై తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేశారు.
కథ ఏమిటనేది టీజర్‌లో చాలా క్లియర్‌గా చెప్పారు. హీరోది లవ్ ఫెయిల్యూర్. ఓ అమ్మాయితో ప్రేమలో విఫలమైన తర్వాత సిగరెట్, మందుకు అలవాటు పడతాడు. ఆ తర్వాత అతడికి మరొక అమ్మాయి పరిచయం అవుతుంది. అప్పుడు ఏమైంది? అనేది 'దిల్ రూబా' సినిమా. అయితే... ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. 'అర్జున్ రెడ్డి' రేంజ్ అనేలా ఉంది.
'మ్యాగీ... నా ఫస్ట్ లవ్. మార్చిలో ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినట్టు మ్యాగీతో లవ్‌లో ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు కింగ్ (సిగరెట్) అండ్ జాన్ (మందు) అని ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు ఇచ్చిన థెరపీతో అమ్మాయిలకు, ప్రేమకు చాలా దూరంగా ఉన్నాను. కానీ, మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా జీవితంలోకి అంజలి వచ్చింది' అని హీరో చెప్పే మాటలతో టీజర్ మొదలైంది. మరి, అంజలితో హీరోకి ఎందుకు గొడవ వచ్చింది? అనేది సినిమాలో చూడాలి.
'నా చేతిలో గన్ను ఉంటే కాల్చి పారదొబ్బేవాడిని తెలుసా?' అని హీరో అంటే... 'రేపు తీసుకొస్తా. వేసేయ్' అని హీరోయిన్ రుక్సార్ చెప్పడం టీజర్ మొత్తంలో హైలైట్. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉందని టీజర్ ద్వారా చెప్పారు.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
'దిల్ రూబా' టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ... ''సారెగమా మొదటి తెలుగు సినిమాలో నేను హీరో కావడం సంతోషంగా ఉంది. మా నిర్మాత రవి డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎప్పట్నుంచో ఉన్నారు. రవి, సురేష్ రెడ్డి 2019లో నాకు పరిచయం. 'రాజావారు రాణిగారు'ను డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అని వాళ్ళ దగ్గరకు వెళ్లాను. ఈ 'దిల్ రూబా'లో నా క్యారెక్టర్ సిద్ధార్థ్ చాలా స్పెషల్. అదొక హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనూ వెనుకడుగు వేయడు. తన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అటువంటి సిద్ధార్థ్ మీలోనూ ఉంటాడు. క్యారెక్టర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. 'దిల్ రూబా'కు సామ్ సిఎస్ మ్యూజిక్ చేశారు. ఇది నా కెరీర్ బెస్ట్ ఆల్బమ్. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం.ఇంటెన్స్ లవ్ స్టోరీతో రూపొందిన పక్కా ఎంటర్‌టైనర్ ఇది. 'క' సినిమా తర్వాత నా సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తప్పకుండా రీచ్ అవుతుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నా. ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేయాలనేది నా ప్లాన్'' అని అన్నారు.
Also Read: అమెరికాలో కన్ను మూసిన టాలీవుడ్ డైరెక్టర్... ఆవిడ తీసిన సినిమాలు ఏమిటో తెలుసా?