Rashmika Mandanna: గాయం నుంచి కోలుకున్న రష్మిక - ఎయిర్ పోర్టులో హ్యపీగా నడక, వైరల్ వీడియో
Rashmika Airport Video: నేషనల్ క్రష్ రష్మిక గాయం నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో ఆమె 'ఛావా' మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్తూ ఎయిర్ పోర్టులో హ్యాపీగా నడిచేస్తోన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

National Crush Rashmika Mandanna Recover From Injury: నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు (Rashmika Mandanna) కొద్ది రోజుల క్రితం కాలికి గాయమైన సంగతి తెలిసిందే. కాలికి పట్టీ కట్టిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ కావడంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షించారు. గాయం అయినప్పటి నుంచీ రష్మిక హైదరాబాద్‌లోనే రెస్ట్ తీసుకుంటుండగా.. తాజాగా, ఆమె గాయం నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో 'ఛావా' సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక ముంబయికి బయలుదేరారు. ఎయిర్ పోర్టులో ఆమె హ్యాపీగా నడిచేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, శనివారం 'పుష్ప 2' థ్యాంక్స్ మీట్ జరగ్గా ఆ కార్యక్రమానికి రష్మిక హాజరు కాలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
View this post on Instagram
ఆ పోస్ట్ వైరల్
కాగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక గాయం నుంచి కోలుకుంటోన్న క్రమంలోనే ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందరిపైనా దయతో ఉండాలంటూ ఆమె ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. 'ఈ రోజుల్లో అందరిలోనూ దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి.' అని పేర్కొన్నారు. అలాగే, రష్మిక ధరించిన టీ షర్టు మీద సైతం దయ అనే రాసి ఉంది. ఇది వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.
Also Read: అనగనగా... ETV Win కోసం సుమంత్ ఎక్స్‌క్లూజివ్ ఫిల్మ్ - బర్త్ డేకి బహుమతిగా ఫస్ట్ లుక్
ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానమే..
అయితే, 'పుష్ప 2' థాంక్స్ మీట్‌లో పాల్గొనలేకపోయిన రష్మిక సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 'పుష్ప 2 థాంక్యూ మీట్‌లో పాల్గొనలేకపోయాను. సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థాంక్యూ. మీరెంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్ పీస్‌ను అందించినందుకు ఓ ప్రేక్షకురాలిగా ధన్యవాదాలు. అలాగే, శ్రీవల్లిగా చెప్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో అన్ని విభాగాలు అద్భుతంగా వర్క్ చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు థాంక్యూ.' అంటూ రష్మిక పేర్కొన్నారు.
ప్రస్తుతం రష్మిక నటించిన 'ఛావా' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. విక్కీ కౌశల్ శంభాజీ మహరాజ్‌గా, ఆయన భార్య పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14వ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే రష్మిక ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, సల్మాన్ ఖాన్ 'సికిందర్', 'థామ', 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్ బో' చిత్రాలతోనూ నేషనల్ క్రష్ బిజీగా ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

