Shambala Vasantha First Look రాత్రి వేళ పొలంలో ఎర్రచీర కట్టుకుని 'వసంత' - చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. హారర్ థ్రిల్లర్ 'శంబాల' నుంచి ఫస్ట్ లుక్
Shambala Vasantha: యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తోన్న లేటెస్ట్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'శంబాల'. ఆయనకు జంటగా స్వాసిక నటిస్తుండగా.. సినిమాలో 'వసంత' ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Swasika As Vasantha In Shamabala First Look Revealed: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) లీడ్ రోల్‌లో వస్తోన్న నేచురల్ హారర్ థ్రిల్లర్ 'శంబాల: ఎ మిస్టీక్ వరల్డ్' (Shambala). ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది భౌగోళిక శాస్త్రవేత్తగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడిగా స్వాసిక (Swasika) నటించారు. తాజాగా, స్వాసిక పాత్ర 'వసంత' (Vasantha) ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. రాత్రి వేళ పొలంలో ఎరుపు రంగు చీర కట్టుకుని ఓ స్త్రీ.. పక్కనే ఓ దిష్టిబొమ్మ, ఆకాశంలో ఎగిరే పక్షులతో కూడిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. 'ఇదొక భిన్నమైన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఆది పవర్ ఫుల్‌గా కనిపిస్తారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.' అని మూవీ టీం తెలిపింది.
ప్రస్తుతం స్వాసిక సూర్య 45వ చిత్రంలో నటిస్తున్నారు. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శంబాల చిత్రం ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. లబ్బర్ పందు, పొరింజు మరియం జోస్, సత్తై, అయలుం నానుమ్ తమ్మిల్, ఇష్క్, శుభరాత్రి, వాసంతి, ఆరాట్టు, సీబీఐ 5, కుమారి మొదలైన తమిళ, మలయాళ భాషల్లో నటించి స్వాసిక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లను తన ఖాతాలో వేసుకున్న స్వాసిక ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు.
Also Read: అనగనగా... ETV Win కోసం సుమంత్ ఎక్స్‌క్లూజివ్ ఫిల్మ్ - బర్త్ డేకి బహుమతిగా ఫస్ట్ లుక్






















