Mahesh Babu: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
Mahesh Babu Remuneration: దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ బాబు చేయబోయే సినిమా ఎట్టకేలకు ముందుకు కదిలింది. పూజతో సినిమాను మొదలు పెడుతున్నారు. ఈ సినిమాకు మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Mahesh Babu Remuneration For SSMB29: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే ఆ చిత్రానికి మహేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని ఇండస్ట్రీ ఖబర్. ఆయనే రెమ్యూనరేషన్ వద్దని చెప్పారట. ఎందుకో తెలుసా?
రెమ్యూనరేషన్ వద్దని మహేష్ ఏం చేస్తున్నారు?
ఎస్ఎస్ రాజమౌళి సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెడుతున్నారు. సారీ సారీ... పాన్ వరల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా కోసం ఎలా లేదన్నా మినిమం మూడేళ్లు మరో సినిమా ఏది చేయకుండా డేట్స్ కేటాయించాలి. మహేష్ అడిగితే... 250 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అంటారు. కానీ ఆయన తనకు రూపాయి వద్దని చెప్పారట.
సుమారు 1000 కోట్ల నిర్మాణ వ్యయంతో మహేష్ బాబు రాజమౌళి సినిమా రూపొందుతోంది. అంత బడ్జెట్ ఖర్చు పెట్టేటప్పుడు నిర్మాత నుంచి రెమ్యూనరేషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని సూపర్ స్టార్ ఫీల్ అయ్యారట. అందుకని, రెమ్యూనరేషన్ బదులు లాభాల్లో వాటా తీసుకోవడానికి అంగీకరించారట. మహేష్ బాబు రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అటు మహేష్ బాబు, ఇటు రాజమౌళి... ఇద్దరికీ లాభాలలో చెరొక 25 శాతం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
రెండు భాగాలుగా సినిమా విడుదల!?
2025, జనవరి 2వ తేదీన మహేష్ బాబు రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవుతుంది. తర్వాత కొన్ని రోజులకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని జక్కన్న డిసైడ్ అయ్యారట.
ఈ ఏడాది షూటింగ్ ప్రారంభించినప్పటికీ మొదటి భాగం రెండేళ్ల తర్వాతే థియేటర్లలోకి రానుందని సమాచారం. 2027లో మొదటి భాగం వచ్చిన తరువాత రెండేళ్లకు రెండో భాగం 2029లో విడుదల అవుతుందట.
Also Read: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఇండియాలో జోన్స్ తరహా అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం కెన్యాలో కొంత భాగం షూటింగ్ చేయనున్నారు. మరికొంత భాగం ఇండియాలో షూటింగ్ చేస్తారు. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటించనున్న ఈ సినిమాలో విలన్ రోల్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేయనున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించును నేపథ్యంలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.