అన్వేషించండి

Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ

Anantapur High Alert Application | హై అలెర్ట్ అప్లికేషన్లో సమాచారం పంపితే చాలు ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం తేలిక అవుతుంది.

Anantapur Police to use High Alert Application | అనంతపురం:  సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి " హై అలెర్ట్ అప్లికేషన్ (High Alert Application) ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం ఈ యాప్ లో పంపితే చాలు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బందికి సమాచారం క్షణాల్లో చేరుతుంది. దీనిపై స్పందించి వెంటనే సిబ్బంది, అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తిన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను సద్దుమణిదేలా చేస్తారు. 

పోలీసు స్టేషన్ల పరిధుల పట్టింపు లేకుండా అందరూ ఏకకాలంలో అప్రమత్తమై జరిగిన ఘటనను సద్దుమణిగేలా చేస్తారు. అన్ని విభాగాల వారు ఒకేసారి సంసిద్ధులు అయ్యేలా హై అలర్ట్ అప్లికేషన్ రూపొందించారు. అత్యవసర పరిస్థితులు, కొన్ని కీలక సందర్భాలలో జిల్లా ఎస్పీ ఈ యాప్ లో ఒక క్లిక్ చేస్తే చాలు సిబ్బంది సెల్ ఫోన్లలో సైరన్ మోగుతూ ఆదేశాలు వెళ్తాయి. దీంతో జిల్లా పోలీసు సిబ్బంది ఏకకాలంలో అప్రమత్తమై సులువుగా సమస్యలను, కేసులను ఛేదించే అవకాశముంది. ఈ యాప్ ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో చాలా ఉపయోగపడుతోంది.

 శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా 
అనంతపురం జిల్లాతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి తదితర మున్సిపాలిటీ పట్టణంలోని శివారు ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టు కోసం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకించి డ్రోన్లను రంగంలోకి దింపారు. బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేసి వారిని, గంజాయి సివించే వారిని, ఈవ్ టీజర్స్ ను డ్రోన్ల ద్వారా పసిగట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులు కృషి చేస్తున్నారు. పోలీసులు వెళ్లలేని పొదలలోకి, అటవీ ప్రాంతంలోకి డ్రోన్లు వెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడునుంది.

ఆపరేషన్ స్వేచ్ఛ
17 మంది పిల్లలకు విముక్తి... తల్లిదండ్రులకు అప్పగించి మైనర్లను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధమని అలాంటి మైనర్లకు పని చేసే చోటు నుండీ విముక్తి. పోలీసులు, లేబర్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగపు అధికారులు ఆపరేషన్ స్వేచ్ఛ ను ఈ ఏడాది 4 సార్లు నిర్వహించారు. వివిధ పరిశ్రమలు, దుకాణాలలో పని చేస్తున్న 17 మంది మైనర్లకు విముక్తి కల్పించి ఆయా తల్లిదండ్రులకు అప్పగించారు. 

Also Read: Anantapur Crime Report 2024: తగ్గిన పోక్సో కేసులు, పెరిగిన మర్డర్ కేసులు - రూ.19.16 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ 

2023లో హత్యలు, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు 956 నమోదు కాగా, 2024లో 1051 కేసులు నమోదయ్యాయి. ప్రాపర్టీ క్రైం రికవరీ 51 శాతం కేసుల్లో పూర్తయింది. జిల్లాలో పోక్సో కేసులో ఈ ఏడాది 8 శాతం తగ్గాయి. లోక్ అదాలత్ లలో 10,933 చిన్న కేసులు పరిష్కారం కోసం యత్నించారు. 15 NDPS కేసులలో 63 మంది అరెస్ట్ అయ్యారు. గ్యాబింగ్, పేకాట కేసులలో రూ. 1,98,37,629 స్వాధీనం చేసుకున్నారు. డయల్ 100/112 కు వచ్చిన కాల్స్ ద్వారా వేల కేసుల్లో ఘటనా స్థలానికి వెళ్లి చర్యలు తీసుకున్నారు. 10,501 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Yadagirigutta: గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
Embed widget