అన్వేషించండి

Anantapur Crime Report 2024: తగ్గిన పోక్సో కేసులు, పెరిగిన మర్డర్ కేసులు - రూ.19.16 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ

అనంతపురం జిల్లాలో ఈ ఏడాది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు పెరగగా, పోక్సో కేసులు తగ్గాయి. భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు.

Anantapur Crime Roundup 2024:  అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఐ.పి.సి, సీఆర్పీసి, మిస్సింగు కేసులు తగ్గాయి. ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ విస్తృతం చేయడం వల్ల అక్రమ మద్యం, గ్యాంబ్లింగ్, ఇసుక అక్రమ రవాణ కేసులు అధికంగా నమోదు చేయడం వల్ల స్పెషల్ లోకల్ లాస్ కేసులు పాక్షికంగా పెరిగాయి. దేహ సంబంధిత నేరాలు 2023 సంవత్సరంలో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు కలిపి 956 నమోదు కాగా.. 2024 లో 1051 నమోదయ్యాయి. 

ప్రాపర్టీ క్రైం రికవరీలో 51 శాతం పురోగతి : 
రాబరీ, పగలు మరియు రాత్రి దొంగతనాలు, సాధారణ దొంగతనాలు కలిపి జిల్లాలో ఈ ఏడాది 529 నమోదు చేయగా 289 కేసులను ఛేదించారు. నమోదు చేసిన కేసులలో రూ.7,31,69,765/- ప్రజలు సొమ్ము పోగొట్టుకోగా ఇందులో రూ.3,76,22,920/- రికవరీ చేశారు. 
 అనంతపురం నాల్గవ పట్టణం, కూడేరు, గార్లదిన్నె పోలీసు స్టేషన్ల పరిధిల్లో జరిగిన ఏటిఎం సెంటర్స్ లో దొంగతనాలను అనంత పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, పుటేజీలను విశ్లేషించడం లాంటి చర్యలతో హర్యాన, రాజస్టిన్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. సిసిఎస్ & రూరల్ పోలీసులు సంయుక్తంగా అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రూ. 22 లక్షలు విలువ చేసే 31 తులాల బంగారు రికవరీ చేశారు. 15 కేసులు ఛేదించారు. 

8 శాతం తగ్గిన ఫోక్సో కేసులు
మహిళలకు సంబంధించిన నేరాలు స్వల్పంగా పెరిగినా ఫోక్సో కేసులు మాత్రం 8 శాతం తగ్గాయి. మహిళా సంబందిత నేరాలు స్వల్పంగా పెరగడానికి తక్షణమే స్పందించి కేసులు కడుతున్నారు. వరకట్న వేధింపులు, గృహహింస కేసులు పెరగడం కూడా కారణమే.


Anantapur Crime Report 2024: తగ్గిన పోక్సో కేసులు, పెరిగిన మర్డర్ కేసులు - రూ.19.16 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ

వైట్ కాలర్ నేరాలు 25 శాతం తగ్గుదల 
చీటింగులు, నమ్మకద్రోహాలు, సైబర్ నేరాలు ఈ ఏడాది గత ఏడాదితో పోల్చితే 25 శాతం తగ్గాయి. గత ఏడాది 377 వైట్ కాలర్ నేరాలు జరుగగా... ఈ ఏడాది 283 జరిగాయి.

 లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి తీవ్ర కృషి: 
లో కేసుల పరిష్కారానికి పోలీసులు తీవ్ర కృషి చేశారు. ఈ ఏడాది యు.ఐ. పి.టి మరియు పెట్టీ కేసులు 10,933 కేసులు పరిష్కారం అయ్యేలా విదులు నిర్వర్తించారు.

 బాధితులకు న్యాయం... నిందితులకు శిక్షలు 
ఈ ఏడాది వివిధ కేసుల్లోని నిందితులకు కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. మొత్తం 77 కేసుల్లో శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించగా... వీటిల్లో రెండు జీవిత కాలాల శిక్ష 01, జీవితఖైదులు 11, పది సంవత్సరాల జైలు శిక్షలు-02, ఐదు సంవత్సరాల జైలు శిక్షలు-03, మూడు సంవత్సరాల జైలు శిక్షలు- 59 ఉన్నాయి.

 ఎన్ఫోర్స్మెంట్ వర్క్ : 
ఈ ఏడాది 15 NDPS కేసులు నమోదు చేసి 63 మందిని అరెస్టు చేశారు. రూ.4,70 లక్షల విలువ చేసే 60.955 కిలోల గంజాయి, 33 సెల్ ఫోన్లు, రూ 38 వేల నగదు సీజ్ చేశారు. గంజాయి కట్టడికి ప్రత్యేకంగా జిల్లాలో టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. 1192 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 3,250 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. రూ. 1,98,37,629/- నగదు స్వాధీనం చేసుకున్నారు.

 రోడ్డు ప్రమాదాలు 
రోడ్డు ప్రమాదాల ఉల్లంఘనలపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు 14,029... డ్రంకన్ డ్రైవ్ 2314 కేసులు మరియు 1,09,038 ఎం.వి కేసులు నమోదు చేసి రూ. 2,40,18,966/- ల ఫైన్లు వేశారు. వీటిల్లో 7595 కేసులు డిస్పోజల్ చేసి పైన్ మొత్తం రూ.19,15,875/- లు ఉల్లంఘనదారుల నుండీ కట్టించారు.

డయల్ - 100/112 కాల్స్ కు తక్షణ స్పందన

ఈ ఏడాది డయల్ 100/112 కు వచ్చిన కాల్స్  20,346 కు జిల్లా పోలీస్ సిబ్బంది నిర్ణీత సమయంలో ఘటనా స్థలాలకు వెళ్లి చర్యలు తీసుకున్నారు. ఆవరేజ్ రెస్పాన్స్ టైం 12 నిముషాలు, అర్బన్ ప్రాంతాలలో 6 నిముషాలు, రూరల్ ఏరియాలలో 18 నిముషాలు రెస్పాన్స్ టైంలో బాధితులకు పరిష్కారం చూపారు. వీటిల్లో 626 కేసులు కూడా నమోదు చేశారు. డయల్- 100, బ్లూకోల్ట్స్ బృందాలతో బాదిత ప్రజలు సకాలంలో ఊరట పొందారు. రక్షక్, హైవే పెట్రోలింగ్ బృందాలను వాడుతున్నారు.

Also Read: South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) : 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభించింది. మొత్తం 1579 పిటీషన్లు రాగా వీటిల్లో 1417 పిటీషన్లకు పరిష్కారం చూపారు. మిగితా 162 పిటీషన్లు ఆస్తి తగాదాలు, రస్తా వివాదాలు, తదితరాలకు సంబంధించినవి.

భారీగా సెల్ఫోన్స్  రికవరీ : 
ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు దాట్ బాట్/ CEIR సేవల ద్వారా రూ.19.16 కోట్ల విలువ చేసే 10,501 మొబైల్ ఫోన్లను బాధిత ప్రజలకు అప్పగించారు. ఇందులో అనంతపురం జిల్లా ప్రజలకు 6,770.... ఇతర జిల్లాల ప్రజలకు 2,575... ఇతర రాష్ట్రాల ప్రజలకు 1,156 మొటైల్ పోన్లు అందజేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Embed widget