అన్వేషించండి

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!

Telugu: ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

AP government has decided to issue government orders in Telugu:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను మరింత విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ఆదేశాల ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. జీవోలన్నీ ఇప్పటి వరకూ ఇంగ్లిష్ లో మాత్రమే వస్తున్నాయి. వాటినే జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఈ జీవోలు సామాన్య ప్రజలకు అర్థం కావు. తెలుగు అధికార భాష అయిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వాలని, తెలుగులోనే పరిపాలన సాగాలని చాలా కాలం నుంచి భాషాభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికి ఈ డిమాండ్ ను అంగీకరించింది.. 

Also Read: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌

ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అందులో పలువురు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలో సూచనలు చేశారు. అలాగే చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య  సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలన్న అభిప్రాయం ఉన్నప్పటికీ పూర్తిగా జీవోలన్నీ ఇంగ్లిష్ కే పరిమితమయ్యాయి. ఇక నుంచి పద్దతి మార్చాలని నిర్ణయించుకున్నారు.                                      

పాలనా పరంగా తెలుగు రాని అధికారులు కూడా ప్రభుత్వంలో ఉంటారు. ఇంగ్లిష్ కూడా జీవోలు ఉండటం వల్ల చాలా మందికి విషయాలపై స్పష్టత ఉంటుందని.. ఇంగ్లిష్ లో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. తమ భాషను కాపాడుకుంటూనే.. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదించి ముందుకెళ్తున్నారని కానీ తెలుగు వాళ్లు మాత్రం ఇంగ్లిష్ మాత్రమే నేర్చుకోవాలన్నట్లుగా పరిస్థితి మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసతున్నారు. దీన్ని మార్చే క్రమంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.                                                

ఇప్పటి వరకూ ఇంగ్లిష్ లో ఉండే ఉత్తర్వులు, జీవోలు సామాన్య ప్రజలకు అర్థం కావు. అవి వెబ్ సైట్‌లో  ఉన్నప్పటికీ ఇంగ్లిష్ కారణంగా చాలా మందికి  అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అధికార ఉత్తర్వులు తెలుగులో వస్తే ప్రజలకు కూడా అర్థమవుతాయి. దీని వల్ల పాలనపై ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు భాషాభిమానులు సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. 

Also Read : JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget