ముఖేష్ అంబానీ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేశారు. ఆయన తండ్రి నిర్మించిన రిలయన్స్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు.



విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తన డిగ్రీని డిస్ కంటిన్యూ చేశారు. తండ్రి చనిపోవడంతో వ్యాపార బాధ్యతలు తీసుకున్నారు.



ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ యజమాని అయిన ఎల్ ఆర్ మిట్టర్ కోల్ కతాలో ఓ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తిచేశారు.



అనిల్ అంబానీ ముంబైలోనే బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలో ఎంబీఏ చేశారు



ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.



కుమార మంగళం బిర్లా ముంబైలో డిగ్రీ, లండన్ బిజినెస్‌ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు.



ఆనంద్ మహింద్రా చదువు అంతా విదేశాల్లోనే సాగింది. హార్వార్డ్ క్యాంపస్‌లో ఆయన చదువులు సాగాయి.



పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ రెడ్డి ఢిల్లీలో బీటెక్ పూర్తి చేశారు. పేటీఎంను ప్రారంభించి సక్సెస్ అయ్యారు.



డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని.. ముంబైలోనే కామర్స్ డిగ్రీ చేసి తండ్రికి వ్యాపారాల్లో సహకరిస్తూ కెరీర్ ప్రారంభించారు.



హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్ చదువంతా తమిళనాడులోనే సాగింది. కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.



సన్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ దిలీప్ సింగ్ కోల్ కతాలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కానీ ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేశారు.