ఎవరు పుట్టించారో తెలియదు.. ఏ దేశానికీ చెందదు ..కానీ చెలామణి ..అదే బిట్ కాయిన్ !



సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్‌కాయిన్ల గురించి 2008లో మొదటి సారి ప్రచారం



బ్లాక్‌చెయిన్ సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్ల సృష్టి -కంప్యూటర్ ద్వారా సృష్టించగలిగే బిట్‌కాయిన్ల సంఖ్య చాలా పరిమితం



మొత్తం బిట్‌కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా మైనింగ్ - 2009 నుంచి ఇప్పటి దాకా 1.24 కోట్ల బిట్‌కాయిన్ల మైనింగ్



.బిట్‌కాయిన్‌లో 10 కోట్లవ వంతు విలువను సతోషిగా పిలుస్తారు. అంటే 10 కోట్ల సతోషిలు ఒక్క బిట్‌కాయిన్‌కు సమానం.



మాఫియా కార్యకలాపాలు నిర్వహించేవారు, హ్యాకర్లకు బిట్ కాయిన్ వరంలా మారింది !



ఆన్‌లైన్ షాపింగ్‌కు బిట్‌కాయిన్లను అనుమతిస్తున్న అంతర్జాతీయ ఆన్ లైన్ షాపింగ్ సైట్లు



2009లో బిట్‌కాయిన్‌ విలువ అమెరికా సెంటు విలువ కంటే కూడా తక్కువ 2024లో ఇప్పుడు 98 వేల డాలర్లు



అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత బిట్ కాయిన్ కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. త్వరలో ఒక్క బిట్ కాయిన్ రూ.కోటికి చేరవచ్చని అంచనా