1.విదేశాల్లో స్థిరపడి కుబేరులుగా మారిన వారిలో మొదటి వ్యక్తి గోపీచంద్ హిందూజా. ఆయన దాదాపుగా రెండు లక్ష కోట్ల రూపాయల సంపద సృష్టించుకున్నారు. హిందూజా లండన్‌లో స్థిరపడ్డారు.
2. రెండో స్థానంలో ఆర్సెలార్ మిట్టర్ యజమాని ఎల్.ఎన్ మిట్టల్ ఉంటారు.ఆయన ఆస్తి రూ. 1 లక్షా 70వేల కోట్ల వరకూ ఉంటుంది. మిట్టల్ కూడా లండన్ లోనే స్థిరపడ్డారు.
3. మూడో స్థానంలో వేదాంత గ్రూప్ యజమాని అనిల్ అగర్వాల్ ఉన్నారు. ఆయన ఆస్తి రూ.1లక్షా 20వేల కోట్ల వరకూ ఉంటుంది. ఆయన కూడా లండన్ లోనే స్థిరపడ్డారు.
4. నాలుగో స్థానంలో షాపూర్జీ పల్లోంజి మిస్త్రీ ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 91వేల కోట్ల వరకూ ఉంటుంది. ఈయన మొనాకో స్థిరపడ్డారు.
5. ఇక శాన్ జోస్ కేంద్రంగా జెండా పాతిన జే చౌదరి జెడ్‌స్కాలర్ అనే కంపెనీని నడుపుతున్నారు. ఈయన ఆస్తి రూ. 90వేల కోట్ల వరకూ ఉంటుంది.
6. లండన్‌లో స్థిరపడిన మరో ఎన్నారై వ్యాపారవేత్త శ్రీప్రకాష్ లోధా ఇండోరమా సంస్థ ద్వారా రూ. 73 వేల కోట్ల ఆస్తిని సంపాదించుకున్నారు.
7. దుబాయ్‌లో స్థిరపడిన వివేక్ చంద్ సెహగల్ సంవర్థన అనే కంపెనీ పెట్టి రూ. 62వేల కోట్ల సంపదను సృష్టించుకున్నారు .
8. ఇక అబుదాబిలో స్థిరపడిన లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తిని రూ. 55వేల కోట్లుగా అంచనా వేశారు.
9. ఇక మియామిలో స్థిరపడిన ఏవియేషన్ వ్యాపారి రాకేష్ గంగ్వాల్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 37వేల కోట్లు.
10. ఇక పదో స్థానంలో పాలో అల్టోలో సెటిల్ అయిన సింఫనీ టెక్నాలజీ యజమాని రమేష్ టి వాద్వాని నిలిచారు. ఆయన ఆస్తి రూ. 36 వేల కోట్లు.