PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని హైలెట్ చేశారు. మహా కుంభమేళా వైవిధ్యం, ఏకత్వాన్ని కొనియాడారు.
PM Modi Last Mann Ki Baat 2024: ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ డిసెంబర్ 29న కూడా జరిగింది. మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నందున ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం ఈ ఏడాదిలో చివరిది. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ 117 (Mann Ki Baat 117)వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ అనేక విషయాల గురించి మాట్లాడారు.
దేశంలో 2015 నుంచి 2023 మధ్య కాలంలో మలేరియా కేసులో 80 శాతం తగ్గాయన్నారు. లాన్సెస్ రిపోర్ట్స్ ప్రకారం దేశంలోని క్యాన్సర్ పేషెంట్లలో 90 శాతం మంది ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రయోజనం పొందారని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్‌లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 75ఏళ్ల పూర్తి చేసుకోవడం, మహా కుంభమేళాలో AI చాట్‌బాట్ వినియోగం, ఒలింపిక్స్ గురించి కీలక విషయాలు చర్చించారు. అందులో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
In #MannKiBaat, PM @narendramodi highlights two major health achievements for India:
— All India Radio News (@airnewsalerts) December 29, 2024
1️⃣ An 80% drop in malaria cases & deaths (2015-2023)
2️⃣ The Lancet reports a significant rise in timely cancer treatment, with 90% of patients benefiting from #AyushmanBharat, reducing… pic.twitter.com/54PQVWiCae
ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
- 2025 జనవరి 26 నాటికి మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. రాజ్యాంగం మనకు మార్గదర్శకం. ఈ సంవత్సరం, నవంబర్ 26న సంవిధాన్ దివస్ నాడు, భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు 75 సంవత్సరాల వేడుక జరుపుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, రాజ్యాంగ వారసత్వంతో దేశ పౌరులను అనుసంధానం చేసేందుకు http://Constitution75.com అనే ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాం. ఇందులో మీరు అనేక భాషలలో రాజ్యాంగాన్ని చదవవచ్చు, రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో భాగం కావాలని నేను అభ్యర్థిస్తున్నాను.
- మహా కుంభమేళాకు చాలా విశిష్టత ఉంది. జనవరి, 2025లో జరిగే ఈ ఉత్సవాలకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. లక్షలాది సాధువులు, వేల సంప్రదాయాలు, వందలాది శాఖలు, అనేక అఖాడాలు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగమవుతారు. ఈ వేడుకల్లో ఎక్కడా వివక్ష ఉండదు. అందరూ సమానులే..
- మొదటిసారిగా, కుంభమేళా ఉత్సవాల్లో AI చాట్‌బాట్ ను ఉపయోగిస్తున్నారు. AI చాట్‌బాట్ ద్వారా కుంభమేళాకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని 11 భారతీయ భాషల్లో పొందవచ్చు. టెక్స్ట్ టైప్ చేయడం లేదా మాట్లాడటం ద్వారా ఎవరైనా ఈ చాట్‌బాట్ నుండి ఎలాంటి సహాయం అయినా అడగవచ్చు.
- డిజిటల్ నావిగేషన్ సాయంతో మహా కుంభమేళా 2025లో ఘాట్లు, దేవాలయాలు, సాధువుల అఖారాలను చేరుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాలను సైతం ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఆయా ప్రాంతాలన్నీ ఏఐ- పవర్డ్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఇవి మేళాలో తప్పిపోయిన వారిని సులభంగా కనిపెట్టేందుకు సహాయపడతాయి.
- KTB - భారత్ హై హమ్.. ఇది పిల్లలకు ఇష్టమైన యానిమేషన్ సిరీస్. KTB అంటే క్రిష్, త్రిష్, బాల్టిబాయ్. ఇప్పుడు దాని రెండవ సీజన్ కూడా వచ్చింది. ఈ మూడు యానిమేషన్ పాత్రలు భారత స్వాతంత్ర్య పోరాటంలో పెద్దగా చర్చించని యోధులు, యోధురాళ్ల గురించి చెబుతాయి. ఇటీవల గోవాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దాని సీజన్-2 చాలా ప్రత్యేకమైన పద్ధతిలో ప్రారంభమైంది. దీన్ని దూరదర్శన్ లేదా ఇతర ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లలో చూడవచ్చు.
- 2024లో సినీ ప్రపంచంలోని ఎందరో మహానుభావుల 100వ జయంతి వేడుకలు జరుపుకున్నాం. ఈ మహానుభావులు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు.
- వచ్చే ఏడాది, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ అంటే మన దేశంలో తొలిసారిగా వేవ్స్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు సమావేశమయ్యే దావోస్ గురించి మీరందరూ వినే ఉంటారు. అదేవిధంగా, WAVES సమ్మిట్‌లో, మీడియా, వినోద పరిశ్రమ నుండి దిగ్గజాలు, సృజనాత్మక ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు భారతదేశానికి రానున్నారు. ప్రపంచ కంటెంట్ సృష్టికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.
- తమిళం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష అయినందుకు ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలలో తమిళం నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెలాఖరున ఫిజీలో భారత ప్రభుత్వ సహకారంతో తమిళ బోధన కార్యక్రమం ప్రారంభమైంది. ఫిజీలో శిక్షణ పొందిన తమిళ ఉపాధ్యాయులు ఈ భాషను బోధించడం గత 80 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
- ఈ సారి బస్తర్‌లో ఒలింపిక్స్ జరిగాయి. బస్తర్ లో ఒలింపిక్స్ జరగడమనే నా కల నెరవేరింది. ఒకప్పుడు మావోయిస్టుల హింసాకాండకు సాక్షిగా నిలిచిన ప్రాంతంలో ఈ సారి ఒలంపిక్స్ జరగడం నిజంగా ఆనందించాల్సిన విషయం.
- మలేరియా 4,000 సంవత్సరాలుగా మానవాళికి పెద్ద సవాలుగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా, ఇది మనకు అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా ఉంది. ఈ రోజు, దేశప్రజలు కలిసికట్టుగా ఉండి ఈ సవాలును బలంగా ఎదుర్కొన్నాందుకు నేను సంతృప్తిగా ఉన్నాను.
In the 117th Episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says "With the help of digital navigation, you will be able to reach different ghats, temples, and akharas of sadhus in Maha Kumbh 2025 The same navigation system will also help you reach parking spaces. The… pic.twitter.com/eoRBfASAXb
— ANI (@ANI) December 29, 2024
Also Read : Drugs Possession : గంజాయి కేసులో ఎమ్మెల్యే కొడుకు సహా తొమ్మిది మంది అరెస్ట్ - ఖండించిన ఎమ్మెల్యే
- కొన్ని వారాల క్రితమే ఈజిప్టులో నిర్వహించిన పెయింటింగ్ పోటీలో సుమారు 23 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ భారతదేశ సంస్కృతిని, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను తెలిపే చిత్రాలను వేశారు. ఈ పోటీలో పాల్గొన్న యువకులందరినీ అభినందిస్తున్నాను. వారి క్రియేటివిటీకి ఎంత పొగిడినా తక్కువే.
- పరాగ్వే దక్షిణ అమెరికాలోని ఒక దేశం. అక్కడ నివసిస్తున్న భారతీయుల సంఖ్య వెయ్యికి మించి ఉండదు. పరాగ్వేలో అద్భుతమైన ప్రయత్నం జరుగుతోంది. ఎరికా హుబెర్ అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఉచిత ఆయుర్వేద సంప్రదింపులు అందిస్తుంది. నేడు, స్థానిక ప్రజలు కూడా ఆయుర్వేద సలహా కోసం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.