Drugs Possession : గంజాయి కేసులో ఎమ్మెల్యే కొడుకు సహా తొమ్మిది మంది అరెస్ట్ - ఖండించిన ఎమ్మెల్యే
Drugs Possession : గంజాయి కేసులో కేరళలోని కాయంకుళం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే యు ప్రతిభ కుమారుడుతో సహా తొమ్మిది మందిని అధికారులు అరెస్ట్ చేశారు.
Drugs Possession : దేశంలో మాదకద్రవ్యాలు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూ ఇయర్ సమీపిస్తుండడంతో అధికారులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై మరింత నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఓ డ్రగ్స్ గ్రూప్ ను అధికారులు పట్టుకున్నారు. మొత్త 9మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వీరంతా అరెస్టయిన కాసేపటికే జైలు నుంచి విడుదలయ్యారు. వివరాల్లోకి వెళితే..
గంజాయి కేసులో కేరళలోని కాయంకుళం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే యు ప్రతిభ కుమారుడుతో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. తకాజి బ్రిడ్డ్ పరిధిలో ఉన్న ఓ గ్రూపు నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. వారి వద్ద గంజాయి మొక్కలు ఉన్నందుకే అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. కానీ ఇది చాలా తక్కువ పరిమాణం, మోతాదు కావున వారందరినీ బెయిల్ పై విడుదల చేశామని ఎక్సైజ్ అధికారి వివరించారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
కొడుకు అరెస్ట్.. ఖండించిన ఎమ్మెల్యే
తన కుమారుడు అరెస్ట్ అయ్యాడన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రతిభ.. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. "ఎక్సైజ్ అధికారులు నా కొడుకు, అతని స్నేహితులను మాత్రమే ప్రశ్నించారు. మీడియా నన్ను అకారణంగా టార్గెట్ చేస్తోంది. ఈ వార్త నిజమైతే నేను క్షమాపణలు చెబుతాను. లేదంటే నాకు మీడియా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
10కేజీల గంజాయి స్వాధీనం
ఒడిశా నుంచి మహారాష్ట్రకు వెళ్తోన్న రైలు నుంచి రవాణా చేస్తోన్న ఇద్దరిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.53లక్షల విలువైన 10కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. వీరు స్థానికంగా ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకుని, వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
జర్మనీలో కొత్త చట్టం
ఇటీవలి కాలంలో గంజాయి, డ్రగ్స్ కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. బంగారు బాటకు అడుగులు వేయాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొందరేమో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మత్తు పదార్ధాలను రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే జర్మనీ ఏప్రిల్ 1, 2024 నుంచి గంజాయి వాడకాన్ని పాక్షికంగా చట్టబద్ధం చేసింది. అంటే ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు లోబడి గంజాయి ఉన్నంత వరకు ఆ దేశంలో దాని వినియోగం చట్టవిరుద్ధం కాదన్నామాట. ఇప్పుడు జర్మనీలో 18 ఏళ్లు పైబడిన ఎవరైనా 25 గ్రాముల కంటే ఎక్కువ గంజాయిని ఉంచుకోవచ్చు. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇంటింటికీ మూడు గంజాయి మొక్కలు నాటేందుకు అనుమతి లభించింది. అయితే పాఠశాలలు, క్రీడా మైదానాలు, నడక మార్గాల సమీపంలో ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల మధ్య గంజాయి వాడకంపై నిషేధం విధించింది.
Also Read : World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత