News
News
X

Gold-Silver Price 13 September 2022: పసిడి ధర పడుతూనే ఉంది, కూడగట్టుకునే టైమ్‌ ఇదే!

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 61,400 కు చేరింది.

FOLLOW US: 

Gold-Silver Price 13 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (సోమవారం) పోలిస్తే నేడు (మంగళవారం) స్థిరంగా ఉంది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 20, స్వచ్ఛమైన పసిడి ₹ 200 తగ్గింది. కిలో వెండి ధర ₹ 200 పెరిగింది.

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 46,750 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 51,000 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 61,400 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు ₹ 46,750 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 51,000 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 61,400 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 47,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,760 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,000 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,150 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,050 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,050 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,780 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,030 గా ఉంది. 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం 'ప్లాటినం' ధర నిన్నటితో పోలిస్తే నేడు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 60 తగ్గి ₹ 22,420 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 13 Sep 2022 05:45 AM (IST) Tags: Gold Price Silver Price hyderabad gold silver price

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Gold-Silver Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు గోల్డ్, సిల్వర్ రేట్లలో కాస్త ఉపశమనం

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Jawa 42 Bobber: సింగిల్ సీటర్-అదిరిపోయే లుక్, జావా నుంచి సరికొత్త బైక్ రిలీజ్!

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Petrol-Diesel Price, 2 October: తగ్గుతున్న క్రూడాయిల్ ధర - మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam