అన్వేషించండి

Borugadda Anil: నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో

Anil: హైకోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్ వీడియో రిలీజ్ చేశారు. తనకేం జరిగినా లోకేష్, చంద్రబాబుదే బాధ్యతన్నారు.

Borugadda Anil: వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కల్యాణ్ కుటుంబాన్ని ద్వేషిస్తూ, వారి కుటుంబంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతానని హెచ్చరికలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్ హైకోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించి  బెయిల్ పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన కనిపించకుండా పోయారు. చెన్నై ఆస్పత్రిలో తన తల్లి చికిత్స పొందుతున్నారని చూసుకోవాలని బెయిల్ తీసుకున్నారు. కానీ ఆయన చెన్నై వెళ్లలేదని గుర్తించారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు కూడా తప్పుడువని తేలడంతో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బోరుగడ్డ అనిల్ ఓ వీడియో విడుదల చేశారు. 

తల్లిని చూసుకునేందుకే మధ్యంతర బెయిల్ తీసుకున్నానన్న బోరుగడ్డ అనిల్                     

తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని ఆమెను చూసుకోవడానికే తాను మధ్యంతర బెయిల్ తీసుకున్నానని అంటున్నారు. హైకోర్టును తాను తప్పుదోవ పట్టించానని.. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చానని జరుగుతున్నప్రచారం అంతా అవాస్తవం అన్నారు. కోర్టును తాను ధిక్కరించబోనన్నారు. చంద్రబాబు, లోకేష్ తనను టార్గెట్ చేస్తున్నారని .. తనకేదైనా జరిగితే వారిదే బాధ్యతన్నారు. తనకు బెయిల్ రాకుండా.. చాలా కఠినమైన సెక్షన్లు పెట్టారని  అవి తనకు వర్తించవని అన్నారు. తనకు జగనే తండ్రి అని చెప్పుకొచ్చారు. హైకోర్టు వారు కూడా పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.     

బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారో వెదుకుతన్న పోలీసులు              

పోలీసులకు ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ అందుబాటులో లేరు. ఆయనకు చెందిన ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. అనంతపురం పోలీసులు చెన్నై అపోలోఆస్పత్రికి వెళ్లారు. ఆయన తల్లి చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయ్యారని .. అయితే మధ్యంతర బెయిల్  పొందిన ఆయన మాత్రం చెన్నైరాలేదని గుర్తించారు. ఆస్పత్రిలో కూడా లేరని సీసీ ఫుటేజీలు చూసి పరిశీలించారు. రెండో సారి కూడా మధ్యంత బెయిల్ పొందడానికి గుంటూరులో ఓ ప్రముఖ ఆస్పత్రి డాక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడంతో ఆయన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పోలీసులకూ తెలియడం లేదు.                               

మధ్యంతర బెయిల్ ఐపోగానే లొంగిపోతారా..   పారిపోతారా ?          

హైకోర్టును సైతం మోసగించడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వీడియో విడుదల చేయడం సంచనలంగా మారింది. ఆయనకు  కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఇంకా ఉంది. ఆ గడువు  సమయానికి వచ్చిలొంగిపోతారా లేకపోతే.. పారిపోతారా అన్నది తెలియాల్సి ఉంది. బోరుగడ్డ అనిల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నాయి. విదేశాలకు పారిపోయే అవకాశం లేదని భావిస్తున్నారు. వీడియో రిలీజ్ చేశారు కాబట్టి దాని ఆధారంగా ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget