అన్వేషించండి

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Vizag News: విశాఖ జూ పార్కులో సోమవారం ఎలుగు బంటి దాడిలో ఓ కేర్ టేకర్ ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగు బోనులో ఉందనుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా అతనిపై ఎలుగు దాడి చేసింది.

Bear Attack on Zoo Park Emplyoee in Visakha: విశాఖ జూపార్కులో (Visakha Zoo Park) సోమవారం ఉదయం విషాదం జరిగింది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జూ కీపర్ గా విధులు నిర్వహిస్తున్న బానవరపు నగేష్ (25) అనే యువకునిపై ఎలుగు బంటి దాడి చేసింది. విజయనగరం జిల్లా గజపతినగరానికి (Gajapathinagaram) చెందిన నగేశ్ విశాఖ వెల్ఫేర్ సొసైటీ (Visakha Welfare Society) ద్వారా గత రెండేళ్లుగా జూలో పని చేస్తున్నట్లు జూ క్యూరేటర్ నందిన సలేరియా తెలిపారు. ఎప్పటిలాగే పార్కు పరిసరాలు శుభ్రం చేసేందుకు ఎలుగు బంటి ఉంచిన ప్రదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత అతను ఎవరికీ కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వెతికే సరికి తీవ్ర గాయాలై కనిపించాడు. తలమీద, ఎడమ చెయ్యిపైన బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు క్యూరేటర్ చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. దాడి చేసిన జిహ్వాన్‌ అనే ఎలుగుబంటిని మిజోరాం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎలుగు బోనులో ఉందనుకుని తన పని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. జూ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎలుగు బంటిని బోనులో బంధించారు. ఈ ఘటనతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

తలుపులు ఎలా తెరుచుకున్నాయ్.?

అయితే, జూపార్కులో ఎలుగు బంటి ఉంచిన బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తెరుచుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియడం లేదని సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలోనే ఎలుగు బోనులోనే ఉందనుకుని నగేష్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడితో జూపార్కులో సిబ్బందికి, సందర్శకులకు భద్రత కరువైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

Also Read: Andhra News YSRCP : హిందూపురం వైసీపీలో అంతే - బాలకృష్ణకు ముందుగానే భారీ మెజార్టీలు వస్తాయని జోస్యం !

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Sharmila on YS Jagan |YSRపేరు  ఛార్జిషీట్ లో పెట్టించిన పొన్నవోలుకు పదవి ఇస్తావా అన్న..!Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
IPL 2024: గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget