అన్వేషించండి

Andhra News YSRCP : హిందూపురం వైసీపీలో అంతే - బాలకృష్ణకు ముందుగానే భారీ మెజార్టీలు వస్తాయని జోస్యం !

Andhra News YSRCP : హిందూపురం వైసీపీ నేతల తీరు ఆ పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. వర్గ పోరాటంలో కొంత మంది బహిరంగంగా బాలకృష్ణకు మద్దతు ప్రకటిస్తున్నారు.

 

Andhra News YSRCP :    ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారు.. గెలిపించుకుంటాం అని అంటారు.. కానీ ఆ నియోజకవర్గంలో తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది ? ఎవరానేత? 

హిందూపురంలో బాలకృష్ణ గెలుపు ఖాయమన్న ఇక్బాల్

హిందూపురం వైసీపీలో వర్గ పోరాటం కంట్రోల్ చేయలేనంత పీక్స్‌కు చేరుతోంది. ప్రతిపక్ష  అభ్యర్థి అయిన నందమూరి బాలకృష్ణ మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాలు సాధిస్తాడని వైసిపి పార్టీ నేతలు చెప్పడం హిందూపురం నియోజకవర్గం లో పొలిటికల్ కాకను రేపింది. సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైసీపీ నేతంలతా గ్రూపులుగా విడిపోయారు. అసలే హిందూపురంలో పార్టీని ఎలా గెలిపించుకోవాలని వైసిపి అధిష్టానం దృష్టి సారిస్తుంటే లోకల్ నాయకుల తిరుతో అధిష్టానం దిక్కు తోచని పరిస్థితిలో పడింది. నియోజకవర్గానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పుట్టపర్తి కి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాడని జోష్యం చెప్పారు. 

ఇక్బాల్ తీరుపై ఇతర వర్గాల ఆగ్రహం

ఈ మాటలు ఇప్పుడు హిందూపురం వైసీపీలో గుగులు పుట్టిస్తున్నాయి.. దాదాపు మూడు నెలల తర్వాత ఇక్బాల్ పుట్టపర్తికి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ప్రస్తుత హిందూపురం వైసిపి ఇన్చార్జి దీపికా రెడ్డి,బాబు రెడ్డి పై ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో బాబు రెడ్డి సైతం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్సీఇక్బాల్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. టైము ప్లేసు చెప్పండి ఎక్కడికైనా వచ్చి సమాధానం చెప్తానంటూ బాబు రెడ్డి సవాల్ చేశారు. దీంతో వైసీపీలో నాయకుల అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొన్నటి వరకు ఇన్చార్జిగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్ ను పార్టీ తప్పించి దీపికా రెడ్డి అనే మహిళను పార్టీ ఇన్చార్జిగా నియమించారు. 

సామాజిక యాత్రలో బయటపడిన  గొడవలు

 స్థానికుడైన నవీన్ నిశ్చల్ ఎంతో బలమైన నాయకుడు. అయితే పార్టీ నుంచి ఆయనకు టికెట్ మాత్రం రాదు. హిందూపురంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నవీన్ నిశ్చల్ కు  ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సామాజిక బస్సుయాత్ర అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ యాత్రలు చేపడుతుంటే.. లోకల్ నాయకుల తీరుతో వైసిపి తలలు పట్టుకుంటుంది. ఎన్నికల సమీపిస్తుండడంతో లోకల్ నాయకుల ఆధిపత్య పోరుకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ తీసుకొని నాయకుల మధ్య ఉన్న గ్యాప్ ను తీసేసి అందరూ పార్టీకి పనిచేసేలా చూడాలని హిందూపురం వైసీపీ నేతలు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 

హైకమాండ్ జోక్యం చేసుకోవాలంటున్న నేతలు

ఇప్పటికే హిందూపురం నందమూరిపురంగా మారిపోయింది. ఇక్కడ వరుసగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుంచి వారి కుటుంబ సభ్యులే వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హిందుపురంకు ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నాడు. వైసీపీలోని అంతర్గత విబేధాలతో  తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే నియోజకవర్గంలోని నాయకులతో సంప్రదింపులు జరిపి వైసీపీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ చెప్పినట్లే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధిస్తాడు అని వైసిపి నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget