గుడివాడలో హైటెన్షన్- వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ- తనను ఓడించే వాళ్లు పుట్టలేదన్న నాని
Gudiwada News: గుడివాడలో వైసీపీ, టీడీపీ జనసేన కూటమి చేపట్టిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. మెయిన్ రోడ్డులో టిడిపి జనసేన, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Gudiwada News: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం గుడివాడలో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తోంది. పోటాపోటీ నిరసనలు, ధర్నాలతో హీటెక్కిపోతోంది. మెయిన్ రోడ్డులో టీడీపీ, జనసేన ఓవైపు కార్యక్రమం నిర్వహిస్తుంటే... వైసీపీ మరో వైపు ఎన్టీఆర్ వర్థంతి చేపట్టింది. దీంతో పోటాపోటీ నినాదాలతో గుడివాడ దద్దరిల్లిపోతోంది.
గుడివాడలో వైసీపీ, టీడీపీ జనసేన కూటమి చేపట్టిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. మెయిన్ రోడ్డులో టిడిపి జనసేన, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపైకి ఒకరు రావడంతో పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించింది.
వైసీపీ, టీడీపీ వర్గీయులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కిందపడిపోయారు. ఇరు వర్గాలను అదుపు చేయడంలో పోలీసులు నాన కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఘర్షణ ప్రాంతానికి చేరుకొని ఇరు పార్టీల శ్రేణులను అక్కడ నుండి పంపించి వేశారు.
గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే టైంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీలు తీయడంపై కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్‌ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని తాను పని చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు కొడాలి నాని. ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నానని అన్నారు. చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే కోర్టులు జైలుకు కదలి వెళ్లి అంటున్నాయి ఎద్దేవా చేశారు.
బాడీలో పార్ట్స్ పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని కామెంట్ చేశారు కొడాలి నాని. బాలకృష్ణ ,చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన జూ. ఎన్టీఆర్‌ను ఏం చేయలేరని విమర్శించారు. ఫ్లెక్సీలు తొలగించడం తప్ప వారికి వేరేది చేతకాదన్నారు.
2019 ఎన్నికల ముందు చంద్రబాబు 3 సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు రావని చెప్పి వెళ్లాలని గుర్తు చేశారు నాని. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు. చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చీలు వేస్తే లక్ష మంది ఎలా వస్తారని ఎద్దేవా చేశారు.
గుడివాడలో తనను ఓడించే వాడు ఇంకా పుట్టలేదన్నారు నాని. తనపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారని తను మాత్రం గెలుస్తూనే ఉన్నానన్నారు. చంద్రబాబు సీనియర్ NTRను గతంలో గద్దె దించారని ఇప్పుడు అదే పరిస్థితి తనకు వస్తుందని జూనియర్‌ను పక్కనపెట్టారన్నారు. బాలకృష్ణ, లోకేశ్ కోసం జూనియర్ NTRను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా? అని ప్రశ్నించారు.
సీఎం జగన్, పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారని అన్నారు నాని. పది రోజులైతే టిడిపి, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారని జోస్యం చెప్పారు. ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్తే తమకు వచ్చిన నష్టం ఏం లేదన్నారు. జగన్ అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తానన్నారు. పదవులపై తనకు మక్కువ లేదన్నారు.