By: ABP Desam | Updated at : 10 Jun 2023 06:24 PM (IST)
పురంధేశ్వరీ, కిరణ్ కుమార్ రెడ్డి
BJP Meeting In Srikalahasti:
మోదీ హయాంలో ఈ 9 ఏళ్లలో ఒక్క స్కాం కూడా జరగలేదు: పురంధేశ్వరీ
తిరుపతి : పాలకుడు ఎప్పుడూ తన మనసుకు నచ్చిన, తోచిన పని చేయకూడదని.. ప్రజల శ్రేయస్సును కోరి పాలకుడు పని చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గడిచిన తొమ్మిది ఏళ్ళల్లో దేశానికి బీజేపీ ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం అందించిందో ప్రజలందరు గుర్తుంచుకోవాలన్నారు. శ్రీకాళహస్తి బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఉన్న పార్టిలో బీజేపీ భిన్నమైన పార్టీ. అధికారాన్ని సేవగా మార్చి చేసే పని చేసే పార్టి బీజేపీ అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన కార్యక్రమం దేశంలో ప్రతి ఒక్కరికి మంచి చేసే కార్యక్రమం. 2014 కంటే ముందు రోజుల్లో ప్రతి రోజు ఒక్కో స్కాం గురించి విన్నే వాళ్ళం. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 9 ఏళ్లలో ఒక్క స్కాం కూడా జరుగలేదు అని పురంధేశ్వరీ పేర్కొన్నారు.
తిరుపతి : ప్రజా జీవితంలో ఉండాలంటే, ప్రాంతీయ పార్టీల వల్ల చెడు జరుగుతుందని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల ముందే బీజేపీ పార్టీలో చేరానన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, సంక్షేమం జరగలేదు అన్నారు. 7 వేల నాలుగు వందల కోట్లతో కండలేరు నుంచి 6.6 టిఎంసీల నీటి సరఫరా చేసేందుకు కృషి చేశానని తెలిపారు.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ఆశీస్సులు తీసుకొని నా దినచర్యను ప్రారంభించాను.
— Jagat Prakash Nadda (@JPNadda) June 10, 2023
మన దేశ సంక్షేమం, పురోగతి కోసం స్వామి వారిని ప్రార్థించాను. ఈ… pic.twitter.com/r94jXmGP6e
తాను చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇస్తే, సొంత జిల్లాకు చెందిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు రాకుండా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు ప్రాంతీయ పార్టిలో అవినీతితో నిండి పోయిందన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ, మోదీతోనే భవిష్యత్తు ఉంది. అందరూ అవినీతి పరులను అంతం చేస్తే, దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
తిరుపతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు ఇలా..
- రూ.870 కోట్లుతో తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (IISER) ఏర్పాటు చేయాలని నిర్ణయం
- రూ.700 కోట్లు తో తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటు
- భారత మాల ఫేజ్-1లో భాగంగా 1863కోట్లతో NH 71 రేణిగుంట - నాయుడుపేట రోడ్డు ఆరు లేన్ల రోడ్డుగా అభివృద్ధి
- రూ.77 కోట్ల వ్యయంతో తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునీకరణ
- 130 కోట్లతో శ్రీ సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా అభివృద్ది బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
TTD News: అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప స్వామి
Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు
Accidents In Tirumala Ghat Road: తిరుమల ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు, 12 మందికి గాయాలు
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>