అన్వేషించండి

AP BJP President Purandheswari : టీటీడీ ఇచ్చే ఇళ్ల పట్టాలపై జగన్ ఫొటో ఎందుకు: పురందేశ్వరి

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి అన్యమతస్తుడని ఈ కారణంచేతనే భక్తులకు సరైన సేవలందించడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.

Amalapuram News: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి(Karunakar Reddy)పై బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్‌(Aandhra Pradesh) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) తీవ్ర ఆరోపమలు చేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) అమలాపురం(Amalapuram)లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పురందేశ్వరి మీడియా సమావేశంలో ప్రభుత్వం, జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ ఛైర్మన్‌ అన్యమతస్తుడైనందునే భక్తులకు సౌకర్యాల కల్పనలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కాదుకదా.. వెంకటేశ్వర స్వామిని వదలని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలో చూస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు.

మొదటి నుంచి వ్యతిరేకించింది బీజేపీ

అన్యమతస్తుడైన వ్యక్తిని టీడీపీ ఛైర్మన్‌గా ఎలా నియామకం చేశారని ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని పురందేశ్వరి గుర్తు చేశారు. హిందూత్వం మీద నమ్మకంలేనటువంటి వారు టీడీపీ దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ జరగాలో అది ఏ మేరకు జరుగుతుందో అన్న ఆందోళన రాష్ట్ర ప్రజలకు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. భక్తులు సమర్పించినటువంటి సమర్పణలను ఒక శాతం తిరుపతి అభివృద్ధికి వాడుకుంటామంటే బీజేపీ ప్రశ్నించిందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందన్నారు.

తిరుపతికి టీటీడీ నిధులు ఇస్తుంటే ప్రశ్నించాం

రూ.100 కోట్లు టీటీడీ నుంచి నిధులు తీసి తిరుపతి పారిశుధ్య కార్మికులకు వేతనాలిస్తామని చెప్పడంపైనా మొదటి నుంచి బీజేపీ ప్రశ్నిస్తోందని అన్నారు పురేందేశ్వరి. ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్‌ ఏమవుతుందో తెలియదు కానీ ఇళ్లమీద, ఆస్తులుమీద, కరెంటు మీద పన్నులు మాత్రం వేస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వసూళ్లు చేసుకున్నటువంటివాటికి సమాధానం చెప్పాలన్నారు.

ఇళ్ల పట్టాలపై జగన్ బొమ్మ ఎందుకు

టీటీడీ బోర్డులో రిటైర్‌ అయినటువంటి వారికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పి భూసేకరణ చేశారని, వారికి ఇచ్చేటువంటి పట్టాలపై ఓ పక్క వెంకటేశ్వర స్వామి ఫొటో ఉంటే మరో వైపు జగన్మోహన్‌ రెడ్డి ఫోటో ఉందన్నారు పురందేశ్వరి. జగన్‌ ఆస్తి పంపకం చేసినట్లు వారి ఫొటో అతికించుకోవడం అనేది ఎంతవరకు సమంజసమనేది ప్రశ్నించారు. 

కేంద్ర పథకాలకు తమ పేరు వేసుకుంటోంది..
కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్‌ ప్రభుత్వం తమ ఫొటోలు, పేరు వేసుకుంటుందన్నారు పురందేశ్వరి. కోటిపల్లి`నర్సాపురం రైల్వే లైనుకు కేంద్రం రూ.1100 కోట్లు నిధులు మంజూరు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.385 కోట్లు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. 

జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉంది.. 
బీజేపీ ఇప్పటికే జనసేనతోనే పొత్తులోనే ఉందని జనసేన కూడా బీజేపీతో పొత్తు ఉందని తెలిపిందని ఆతరువాత పైన విషయాలన్నీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి తెలిపారు. ప్రస్తుతం మేము పొత్తులోనే ఉన్నామని పునరద్ఘాటించారు.. టీడీపీతో జనసేన గురించి కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని బీజేపీ అయితే జనసేనతో పొత్తులోనే ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికలకు సంబందించి పొత్తుల విషయం బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.

బీజేపీను బలోపేతం చేయడమే లక్ష్యం..
గ్రామస్థాయిలో బీజేపీను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు. అమలాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌లెవెల్‌ నాయకులుతో సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ బలోపేతానికి దిశా నిర్ధేశం చేశారు. అమలాపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతోపాటు పలువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: రణస్థలంలో రిపోర్టర్ ఆత్మహత్య- ఎచ్చెర్ల ఎమ్మెల్యే మెడకు చుట్టుకున్న వివాదం

Also Read: వైద్యవిద్యలో మేటి విశాఖపట్నం, జిల్లాలోని మెడికల్ కాలేజీలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget