By: ABP Desam | Updated at : 30 Sep 2021 10:29 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టిందని తెలంగాణ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో వాదించింది. నిబంధనలు పాటించని ఏపీని కచ్చితంగా శిక్షించాలని కోరింది. కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసకునే అధికారం ఎన్జీటీకి ఉందని తెలిపింది. అన్ని కోణాల్లో పరిశీలించి కోర్టు ధిక్కరణపై నిర్ణయం తీసుకుంటామని గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ముగింపు వాదనలకు ఆంధ్రప్రదేశ్ కి అవకాశం ఇచ్చింది. తీర్పును రిజర్వు చేయనున్నట్లు ఎన్జీటీ చెప్పింది.
పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు
ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌ఫర్ట్ కమిటీకి తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులు, అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టు అని లేఖలో తెలిపింది. కృష్ణా బేసిన్ వెలుపలకు పెద్దమొత్తంలో నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని రజత్ కుమార్లేఖలో తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని ఆరోపించింది. రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీ లంకామల్లేశ్వర, శ్రీ పెనుసిలా నరసింహ, శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రాజెక్టు కాల్వలకు 10 కిలోమీటర్ల పరిధిలోపే ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: పోలవరం పనులకు "స్టాప్ వర్క్ ఆర్డర్" టెన్షన్..!
గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకుండా తగిన అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టవద్దని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని తెలంగాణ తెలిపింది. 2020 అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రికి రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందని పేర్కొంది. కేంద్ర జలసంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని కేంద్రం ఏపీని ఆదేశించిందని లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు న్యాయ, హైడ్రాలజికల్, పర్యావరణ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలని రజత్ కుమార్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను లేఖలో కోరారు.
Also Read: సీమ ప్రాజెక్టులో పనులేమీ జరగడం లేదని ఎన్జీటీకి కేంద్రం నివేదిక ! ఏపీ సర్కార్‌కు రిలీఫ్ !
Andhra News : సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !
APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్, విజయనగరంలో అకౌంటెంట్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
Top Headlines Today: విశాఖ నుంచే పోటీ చేస్తానన్న లక్ష్మీనారాయణ! తెలంగాణలో ఆలయాలకు క్యూ కట్టిన నేతలు
Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
Deadlines in December: డెడ్‌లైన్స్ ఇన్ డిసెంబర్, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
/body>