Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Ticketlu Meme Konali Full Video: 'టిక్కెట్లు మేమే కొనాలి, సప్పట్లు మేమే కొట్టాలి... సావులు మేమే సావాలి, సంపాదన మీదే కావాలి' అంటూ తీసిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అభిమానులతో కలిసి సినిమా చూడాలని సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చిన అల్లు అర్జున్ (Allu Arjun) గానీ, తమ అభిమాన హీరో మూడేళ్ల తర్వాత 'పుష్ప ది రూల్' సినిమాతో వెండితెర మీదకు వస్తుండడంతో అందరి కంటే ముందుగా పెయిడ్ ప్రీమియర్ చూడాలని వచ్చిన రేవతి కుటుంబం గానీ విషాదం జరుగుతుందని ఊహించలేదు. రేవతి మృతి బాధాకరం. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ నుంచి ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేశారు. అయితే... ఈ ఘటనలో బన్నీని బాధ్యుడిని చేస్తూ ఒక సెటైరికల్ సౌంగ్ చేసింది మసాలా బ్యాండ్.
టికెట్లు మేమే కొనాలి... సావులు మేమే సావాలి...
డిసెంబర్ 27న మసాలా బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానల్ జానపద శైలిలో సాగే ఒక మ్యూజికల్ వీడియో విడుదల అయ్యింది.
'టికెట్లు మేమే కొనాలి... సప్పట్లు మేమే కొట్టాలి...
సావులు మేమే సావాలి... సంపాదన మీదే కావాలి...
పైసాతోనే ప్రాణం కొంటారా పెద్ద మనుషులు...
మీ వల్లే సచ్చిన మనిషిని చూడరావు ఓ మనసులు...' అంటూ సాంగ్ సాగింది.
సాంగ్ మొదలైన వెంటనే స్క్రీన్ మీదకు ఓ అమ్మాయి వచ్చింది. ఆమె ఒక భుజం పైకెత్తి 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ నచ్చినట్లు నడిచి వచ్చింది. ఆ తర్వాత లిరిక్స్ స్టార్ట్ అయ్యాయి. అల్లు అర్జున్ పేరు గానీ, పుష్ప ప్రస్తావన గానీ ఎక్కడా పాటలో తీసుకు రాలేదు. కానీ, ఆవిడ మేనరిజం చూస్తే రేవతి మృతి మీద అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని నిందిస్తూ సెటైరికల్ సౌంగ్ చేసినట్లు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదొక్కటే కాదు... సెల్ఫీ కోసం వస్తే చెంప పగల కొడతారని, కటౌట్లు కట్టి మా ప్రాణాలు పోయానని పాటలో సెటైర్స్ వేశారు.
శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనా!?
రేవతి మరణం సెన్సిటివ్ ఇష్యూ. అటువంటి అంశం మీద సాంగ్స్ చేయడం పట్ల సోషల్ మీడియాలో కొంత మంది నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ట్వీట్లు చేస్తున్నారు కొందరు. ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉంటుంది అని ఆ గీత దాటి ప్రవర్తించటం మంచిది కాదు అని మసాలా బ్యాండ్ నిర్వాహకులకు సలహాలు ఇస్తున్నారు.
'టిక్కెట్లు మేమే కొనాలి' పాట కింద కామెంట్ సెక్షన్ చూస్తే... వాళ్లను కొందరు అప్రిషియేట్ చేశారు. అదే కామెంట్ సెక్షన్ లో ఇంకొంత మంది తిడుతూ పోస్టులు చేస్తారు. 'ఇంటర్నెట్ రీఛార్జిలు మేమే వేసుకోవాలి, మీ వీడియో సాంగ్స్ మేమే చూడాలి. మీ వీడియో సాంగ్స్ చూడడానికి రీఛార్జ్ ఏమైనా వేస్తున్నారా' అని ఒకరు కామెంట్ చేస్తే... 'మేము ఈ సాంగ్ చూస్తే మీరు డబ్బులు సంపాదించుకోవాలి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'గురుకులంలో 50 మంది పిల్లలు పోయారు వాళ్ల కోసం పాడితే నువ్వు మంచి దానివి అనుకుంటాం' అని మరొకరు బూతులు తిట్టారు. 'ప్రతి ఒక్కరూ బన్నీని తిట్టే వాళ్ళే' అంటూ ఇంకొకరు హీరోకి మద్దతుగా పోస్టులు చేశారు.
'అభిమానులు మూర్ఖులు. వాళ్లు మారాలి అంతేగాని మూవీ వాళ్ళ మీద ఏడవడం ఏమిటి? పిచ్చి వాళ్ళు ఉంటే అంతే మరి' అని మరొకరు చేశారు. హైడ్రా మీద కూడా ఇటువంటి పాట చేస్తారా? ఇళ్లు కూలిపోయిన వాళ్ల బాధలు చూపిస్తారా? అని కొందరు ప్రశ్నించారు.
Also Read: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Using a sensitive issue to create a satirical song is absolutely nonsensical and unacceptable. Some boundaries should never be crossed.pic.twitter.com/iEpuEsJiHk
— Milagro Movies (@MilagroMovies) December 29, 2024
ఎవడు టిక్కెట్లు కొనమంటున్నాడు? ఎవడు చప్పట్లు కొట్టమంటున్నాడు? ఎవడు సెల్ఫీలు అడగమంటున్నాడు? గొమ్మున కూర్సోరాదే ఇళ్ళల్లో.
— Aaradhana Reddy 💕 (@aaradhanareddyy) December 29, 2024