Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Telangana News | ఓ నిరుపేద విద్యార్థిని ఉన్నత విద్య కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఉన్నత చదువులకు సాయం చేయడానికి పెద్ద మనసుతో ముందుకొచ్చారు.
Komatireddy Venkat Reddy | నిరుపేద విద్యార్థిని తన ఉన్నత విద్యకు సాయం చేయాలని రిక్వెస్ట్ చేయగా మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఆమె చదవుకు ఆటంకం కలగకుండా చూసేందుకు ఆర్థికసాయం చేశారు. ఇటలిలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో) లో అర్కిటెక్చర్ కన్ స్ట్రక్షన్ లో మాస్టర్స్ లో విద్యార్థిని ప్రణవి చొల్లేటికి సీటోచ్చింది. తన కుటుంబం చదువు ఖర్చు అంత భరించేస్థితిలో లేదు సర్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్ధిని విన్నవించింది.
ఏ విద్యార్థి చదువు మధ్యలోనే ఆగిపోకూడదు
విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి ఆదివారం రోజు ఉదయం తన ఇంటికి పిలిపించి ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. నా చదువుకు అండగా ఉంటానంటూ మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారని విద్యార్థిని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే జీవితం అక్కడే ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన ఏ విద్యార్ధి చదువు మధ్యలోనే ఆగిపోకుడదని పేర్కొన్న ఆయన.. మన జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనని మంత్రి అన్నారు.
మంత్రి సాయంపై విద్యార్థిని, ఆమె ఫ్యామిలీ హర్షం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన చదువుకు చేసిన ఆర్థిక సహాయంపై విద్యార్థిని ప్రణవి హర్షం వ్యక్తం చేశారు. సర్ నా పరిస్థితి ఇలా ఉందని తెలియగానే వెంటనే స్పందించారు. నువ్వెం భయపడకు నేనున్నానని నాకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో నేడు తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారని విద్యార్థిని ప్రణవి తెలిపారు.
కోమటిరెడ్డి సర్ అందించిన తోడ్పాటుతో ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడతా అన్నారు. కెరీర్‌లో ఎదుగుతూనే తనలాంటి వారికి తాను తోడుగా ఉంటానని ఈ సందర్భంగా విద్యార్థిని తెలిపింది. ఇప్పటికే ప్రతిభ కలిగి, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరో విద్యార్ధులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సార్ సహాయ సహాకారాలు అందిస్తున్నారు. వారి మంచి మనసుకు తన తరఫున, తన ఫ్యామిలీ తరఫున ప్రణవి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్ చేతికి మరో అస్త్రం