Rayalaseema Lift Irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఏపీ అఫిడవిట్‌... అధ్యయనంలో భాగంగానే పనులు.. కాంక్రీట్ పనులు చేపట్టలేదని నివేదిక

చెన్నైలోని ఎన్జీటీలో రాయలసీమ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై శుక్రవారం విచారణ జరగనుంది. ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిడ్ దాఖలు చేసింది. ప్రాజెక్ట్ పనులు చేయడంలేదని స్పష్టం చేసింది.

FOLLOW US: 

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలపై పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్)లో విచారణ జరగనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ పథకం డీపీఆర్‌ రూపొందించడానికి అవసరమైన పనులను మాత్రమే చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీడబ్ల్యూసీ నుంచి అనుమతుల కోసం అవసరమైన పనులు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. జులై 7 నుంచి డీపీఆర్‌ పనులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఆ ప్రదేశంలో యంత్రాలు లేవని, కార్మికులు కూడా లేరని ఎన్జీటీకి తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు జాయింట్‌ కమిటీ పేర్కొనలేదని ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది. 

అఫిడవిట్ దాఖలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎన్జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 8.89 కిలోమీటర్ల అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణానికి 250 లక్షల క్యూమెక్స్‌ తవ్వకాలు జరగాల్సి ఉండగా 30% అంటే 74 క్యూమెక్స్‌ తవ్వినట్లు తెలిపారు. ఐఐటీ సభ్యుల టీమ్ 2020లో ఇచ్చిన నివేదికలోని 5వ సిఫారసు ప్రకారం అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణంలో సున్నపురాయి ఉండటంతో నీటిని పీల్చుకునే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ ఛానల్ ను మరింత లోతుగా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పంప్‌ హౌస్‌ నిర్మాణంలో భాగంగానే 1 నుంచి 12 స్లోపుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వర్షాలతో ఇవి కుంగిపోకుండా నివారించేందుకు గోడలు నిర్మించామని పేర్కొన్నారు.  అంతేగానీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎలాంటి కాంక్రీట్‌ పనులు చేపట్టలేదన్నారు. 

Also Read: Kabul Airport: వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం...తరలింపు ఆగదు... కాబూల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అధ్యయనంలో భాగంగా

250 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల లోతు పంప్‌ హౌస్‌ ఉంటుందని, అధ్యయనంలో భాగంగా కేవలం 50 నుంచి 60 మీటర్ల వరకు తవ్వినట్లు నివేదికలో పేర్కొన్నారు. 1.75 క్యూమెక్స్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉందని, ఈ పనులకు రెండు, మూడు సీజన్‌ల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాకాలం అనంతరం నీటిని తొలగించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని ఎన్జీటీకి తెలిపారు. 5 మీటర్ల చుట్టుకొలత, 200 మీటర్ల పొడవుతో 12 పైపులైన్లు వేయాల్సి ఉందని, శాంపిళ్లలో భాగంగా 35 నుంచి 40 మీటర్ల పొడవు పైప్ లైన్ వేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

రాయలసీమ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విచారణ

జాయింట్‌ కమిటీ నివేదికపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఎన్జీటీలో మెమో దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటినీ వక్రీకరిస్తోందన్నారు. జాయింట్‌ కమిటీ ఆధారాలతో సహా పనులు జరిగినట్లు నివేదిక ఇచ్చినా పనులు జరగలేదని వాదిస్తోందన్నారు. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. అందువల్ల కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌లతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపైనా శుక్రవారం చెన్నైలోని ఎన్జీటీ విచారణ జరగనుంది. 

Also Read: AP New Property Tax: ఏపీలో అమల్లోకి కొత్త ఆస్తి పన్ను... ఏప్రిల్ ఒకటి నుంచి లెక్కిస్తున్నట్లు నోటీసులు.. పట్టణ స్థానిక సంస్థల్లో గెజిట్‌ నోటిఫికేషన్లు

Published at : 27 Aug 2021 11:14 AM (IST) Tags: telugu states NGT Water issue AP TS News Rayalaseema lift irrigation palamuru lift irrigation

సంబంధిత కథనాలు

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Tirupati Crime : విడాకులు తీసుకున్న యువకులే కిలాడీ లేడీ టార్గెట్, పెళ్లి చేసుకుని ఆస్తులకు ఎసరు!

Chandrababu Letter : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై సీఐడీ వేధింపులు, డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu Letter : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై సీఐడీ వేధింపులు, డీజీపీకి చంద్రబాబు లేఖ

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

టాప్ స్టోరీస్

BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

IND vs ENG 5th Test Day 3: కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్‌స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?

IND vs ENG 5th Test Day 3: కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్‌స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!