AP Politics: బెజవాడలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.... మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీ
ముగ్గురు నేతల తాజా భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీ కలిసి రంగా వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరు నేతలు మంత్రి కొడాలి నానిని కూడా కలిశారు.
బెజవాడలో వంగవీటి మోహన రంగా 33వ వర్థంతి కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రంగా వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణతో కలసి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. రంగాను కీర్తించారు. రంగా ఆశయాలను సాధిస్తామంటూ మాట్లాడారు. రంగా పేరును పదే పదే ప్రస్తావించారు. సాధారణ ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ వైసీపీ నుంచి టీడీపీలో చేరటం సంచలనంగా మారింది. అయితే ఇటీవల అసెంబ్లీ వేదికగా వంశీ చేసిన కామెంట్స్ తో టీడీపీతో పాటుగా ఓ సామాజిక వర్గం కూడా ఆయనపై సీరియస్ గా ఉంది. దీంతో ఇదే సమయంలో రంగా వర్థంతి కార్యక్రమంలో వంశీ పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణతో కలసి నివాళులర్పించారు. ఈ పరిణామాలు ఇప్పడు టీడీపీ, వైసీపీలో తీవ్ర సంచలనంగా మారాయి.
Also Read: ఆశలు వమ్ము చేయను.. తెలుగువాడిగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తా - జస్టిస్ ఎన్వీ రమణ
మంత్రి కొడాలి నానితో వంగవీటి రాధాకృష్ణ
వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొనటం రాజకీయంగా కలకలం రేపింది. తాజాగా గుడివాడలో వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీతో మంత్రి కొడాలి నాని కూడా కలిశారు. ఒక దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు నేతలు కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ
మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఇటీవల అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాలు అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ చేశారు. తిరిగి సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. ఈ వ్యవహరంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాత్రను కూడా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వంశీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. వైసీపీకి మద్దతుగా చేసిన కామెంట్స్ అనంతరం జరిగిన పరిణామాలపై వల్లభనేని వంశీ భువనేశ్వరికి బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయితే తాజాగా వంగవీటి మోహన్ రంగా వర్థంతి కార్యక్రమంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణతో కలసి వంశీ పాల్గోన్నారు. ఈ వ్యవహరం వైసీపీ, టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అటు కాపు, కమ్మ సామాజిక వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల ముందు వరకు వైసీపీ లో ఉన్న వంగవీటి రాధా, టీడీపీలో చేరటం ఎన్నికలు తరువాత టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీ పంచన చేరటం అందరికి తెలిసిందే. ఈ తరుణంలో రంగా విగ్రహం సాక్షిగా ఇరువురు నేతలు కార్యక్రమంలో పాల్గొనటం, దివంగత నేత రంగాను ఉద్దేశించి వంశీ మాట్లాడటం కూడా అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయనే చర్చ జరుగుతుంది.
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?