Omicron Cases In AP: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ
ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ (AP Omicron Cases) కావడం కలకలం రేపుతోంది. ఇదివరకే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
Omicron Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఏపీలో తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులో ప్రకాశంలో ఒకరు, అనంతరపురం జిల్లాలో మరొకరు కొత్త వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ డైరెక్టర్ హైమావతి వెల్లడించారు. ఇటీవల విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు వెలుగుచూడగా తాజాగా మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.
డిసెంబర్ 16వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి విమానంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఒంగోలుకు చేరుకున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చారని ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. తదుపరి టెస్టులకు హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్వింగ్ సెంటర్ సీసీఎంబీకి శాంపిల్స్ పంపించారు. అక్కడ జరిపిన టెస్టులలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా డిసెంబర్ 25న నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. అతడిని నేరుగా కలుసుకున్న ప్రైమరీ కాంటాక్ట్స్ నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించగా కొవిడ్19 నెగెటివ్ గా రావడం ఊరట కలిగించింది.
#COVIDUpdates: As on 25th December, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 25, 2021
COVID Positives: 20,73,515
Discharged: 20,57,777
Deceased: 14,489
Active Cases: 1,249#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iZ5DGR6wzF
అనంతపురంలో ఒమిక్రాన్.. విదేశాల నుంచి ఏపీకి
విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. తదుపరి టెస్టులు చేయగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా కేసులు వెలుగు చూస్తున్నాయి. డిసెంబర్ 18న బ్రిటన్ నుంచి ఓ వ్యక్తి బెంగళూరుకు చేరుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ వ్యక్తి బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన సొంత ప్రాంతానికి వచ్చాడు. కొవిడ్19 నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్‌కు తరలించి శాంపిల్స్ పరీక్షించగా అతడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయన కుటుంబసభ్యులు, నేరుగా కలుసుకున్న వారి శాంపిల్స్ సేకరించి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా కోవిడ్19 నెగెటివ్‌గా వచ్చినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 28,209 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 104 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,489కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 133 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,672 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1249 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: ఒమిక్రాన్ టెన్షన్.. ఏపీలో మరో వ్యక్తికి పాజిటివ్.. ఆమె ఎక్కడెక్కడ తిరిగారంటే..!
Also Read: Omicrona Updates: తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు....ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, టీఎస్ లో 140