News
News
వీడియోలు ఆటలు
X

Omicron Case in AP: ఒమిక్రాన్ టెన్షన్.. ఏపీలో మరో వ్యక్తికి పాజిటివ్.. ఆమె ఎక్కడెక్కడ తిరిగారంటే..!

విదేశాల నుంచి ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన మహిళ చెన్నై నుంచి తిరుపతి చేరుకున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ రాగా, ఆపై ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించినట్లు ప్రకటించారు.

FOLLOW US: 
Share:

Omicron Case in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కు చేరుకుంది. విదేశాల నుంచి ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అనంతరం టెస్టులు నిర్వహించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 39 ఏళ్ల మహిళ డిసెంబర్ 10న కెన్యా నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో దిగిన మహిళ అక్కడి నుంచి ఏపీలోకి తిరుపతికి వచ్చారు. ఆమెకు నిర్వహించిన కరోనా టెస్టులలో డిసెంబర్ 12న పాజిటివ్ గా నిర్ధారించారు. ఏపీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించారు.

కెన్యా నుంచి తిరుపతి.. వయా చెన్నై.. 
ఈ నెల 10న 39 ఏళ్ల మహిళ కెన్యా నుంచి చెన్నైకి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి కారులో తిరుపతికి ప్రయాణించారు. తిరుపతికి చేరుకున్నాక నిర్వహించిన ఆర్‌టీ‌పీసీఆర్ టెస్టులలో ఆమెకు డిసెంబర్ 12న కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ జీనోమ్ సీక్వెన్సింగ్ సీసీఎంబీ సెంటర్‌కు పంపించారు. డిసెంబర్ 22న ఆ మహిళకు సోకింది ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయిందని ఏపీ గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆమె కుటుంబసభ్యులకు ఆరుగురికి టెస్టులు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలిందన్నారు. అయితే క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు..
ఏపీలో నమోదైన రెండో ఒమిక్రాన్ కేసు ఇది. ఇప్పటివరకూ విదేశాల నుంచి 49 మంది రాష్ట్రానికి రాగా, వారి కుటుంసభ్యులకు నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్టులలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ సీసీఎంబీ సెంటర్‌కు శాంపిల్స్ పంపించి తదుపరి పరీక్షలు నిర్వహించగా.. వారికి ఒమిక్రాన్ నెగటివ్‌గా వచ్చినట్లు ప్రకటనలో తెలిపారు. అయితే కోవిడ్19 నిబంధనలు పాటించాలని, ప్రజలు ఒమిక్రాన్ గురించి భయపడవద్దని సూచించారు.

ఏపీ కరోనా అప్ డేట్స్..
ఏపీలో కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 27,233 పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు చనిపోయారు. కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,481కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం 20,60,061 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,432 యాక్టివ్‌ కేసులున్నాయి.

Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త

Also Read: Weather Updates: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

Also Read: Biryani: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Dec 2021 12:05 PM (IST) Tags: ap corona cases Corona Deaths In AP latest corona updates Omicron Andhra Pradesh Corona Cases New Covid Updates Omicron Case in AP AP Omicron Cases

సంబంధిత కథనాలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

టాప్ స్టోరీస్

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా