Biryani: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
బిర్యానీ లవర్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అందుకు స్విగ్గీ చేసిన ఈ సర్వేనే సాక్ష్యం.
బిర్యానీ... అసలు ఆ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోవడం ఖాయం. బిర్యానీకి భారీ అభిమానులే ఉన్నారని తెలుసు కానీ, ఏకంగా నిమిషానికి 115 బిర్యానీలు అమ్ముడయ్యేంత స్థాయిలో ఉన్నారని మాత్రం ఇప్పుడే తెలుస్తోంది. స్విగ్గీ సంస్థ ప్రతి ఏడాది చివరలో తమకు అధికంగా వచ్చిన ఆర్డర్ల గురించి ఓ నివేదికను ప్రచురిస్తుంది. అందులో బిర్యానీ గురించి దిమ్మదిరిగే షాకింగ్ విషయాలు చెప్పింది స్విగ్గీ.
బిర్యానీనే కింగ్
2021లో స్విగ్గీలో దాదాపు 4.25 లక్షల మంది కొత్తగా చేరారు. వారంతా కూడా చికెన్ బిర్యానీనే ఆర్డర్ చేశారు. మొత్తంగా చూసుకున్నా నిమిషానికి 115 బిర్యానీలు ఆర్డర్ అందాయని, గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువని స్విగ్గీ నివేదికలో పేర్కొంది. 2020లో నిమిషానికి 90 బిర్యానీ ఆర్డర్లే అందాయి.
న్యూజిలాండ్ జనాభాతో సమానం
ఇక స్నాక్స్‌లో అధికంగా అమ్ముడైంది సమోసా. ఈ ఏడాది మొత్తం దాదాపు 50 లక్షల సమోసా ఆర్డర్లు అందాయని, ఆ సంఖ్య న్యూజిలాండ్ దేశజనాభాతో సమానమని పేర్కొంది స్విగ్గీ. సమోసా తరువాతి స్థానంలో దాదాపు 21లక్షల ఆర్డర్లతో పావ్ బాజీ నిలిచింది.
గులాబ్ జామూన్ దే మొదటి స్థానం
ఇక స్వీట్ల విషయానికి వస్తే 21 లక్షల ఆర్డర్లతో గులాబ్ జామ్ మొదటి స్థానంలో ఉండగా, 12.7 లక్షల ఆర్డర్లతో రసమలై రెండో స్థానంలో ఉంది.
స్విగ్గీ ఈ ఏడాది అధికంగా డెలివర్ చేసిన పండ్లు, కూరగాయలు ఏంటంటే... టొమటోలు, అరటిపండ్లు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పచ్చిమిర్చి. ఈ ఏడాది అమ్మిన మొత్తం అరటిపండ్ల బరువును కొలిస్తే, వాటి బరువు అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ బరువుకు రెండున్నరెట్లు అధికంగా ఉంటాయని స్విగ్గీ పేర్కొంది.
Read Also: చల్లని సాయంత్రం వేడివేడి ఎగ్ కబాబ్స్... తింటే ఆ కిక్కే వేరప్పా
Read Also: పిల్లలకు పెట్టేందుకు సింపుల్ స్నాక్స్... అన్నీ ఆరోగ్యకరమైనవే
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి