News
News
X

Egg Kebabs: చల్లని సాయంత్రం వేడివేడి ఎగ్ కబాబ్స్... తింటే ఆ కిక్కే వేరప్పా

చలికాలంలో వేడిగా ఏదో ఒకటి తినాలనిపించడం సహజం. అందులో గుడ్డు వంటకాలైతే మరీ నోరూరిపోతుంది.

FOLLOW US: 

చికెన్ కబాబ్స్, మటన్ కబాబ్స్ మనకు తెలిసినవే. వీటిని అందరూ తినే ఉంటారు. కానీ కోడీ గుడ్లతో కబాబ్ చేసుకుంటే ఆ రుచే వారు. వీటిని తయారుచేయడం కూడా చాలా సులభం. కోడి గుడ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. పైగా బోలెడంత శక్తినిస్తాయి. త్వరగా ఆకలేయకుండా చూస్తాయి. అందులోనూ గుడ్డును సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. అలాంటప్పుడు ఎగ్ కబాబ్స్ చేసుకుని తింటే స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది, అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. 

కావాల్సిన పదార్ధాలు
ఉడకబెట్టిన కోడిగుడ్లు - నాలుగు
శెనగపిండి - వంద గ్రాములు
గరం మసాలా - ఒక టీస్పూను
మిరియాల పొడి - అరటీస్పూను
ఉల్లితరుగు - పావు కప్పు
కొత్తి మీర తరుగు - ఒక టీస్పూను
కారం - ఒక టీస్పూను
నూనె - వేయించడానికి సరిపడినంత
నీళ్లు - పిండి కలపడానికి సరిపడినన్ని
ఉప్పు - రుచికి తగినంత
బ్రెడ్ పొడి - పావు కప్పు

తయారీ ఇలా...
కోడిగుడ్లను సన్నగా తరిగాలి. పచ్చసొనను పడేయాల్సిన అవసరం లేదు. వాటిని కూడా చిదిమేయాలి. ఇప్పుడు అందులో శెనగపిండి, గరం మసాలా, మిరియాల పొడి, ఉల్లితరుగు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. గారెలు వేయడానికి ఎంత గట్టిగా రుబ్బుకుంటామో అదే జారుడుతనం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకు కావాల్సినంత నూనెను వేసి మరిగించాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని కబాబ్స్ లో చేతితో అద్దుకుని ఓ సారి బ్రెడ్ పొడిలో ఇటూ అటూ తిప్పాలి. వాటిని నూనెలో వేయించాలి.  అవి వేగాక తీసి నూనె పీల్చే కాగితంపై వేయాలి. అంతే టేస్టీ ఎగ్ కబాబ్స్ రెడీ. 

Read Also: పిల్లలకు పెట్టేందుకు సింపుల్ స్నాక్స్... అన్నీ ఆరోగ్యకరమైనవే

Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
Read Also: నెలసరి సమయంలో వీటికి దూరంగా ఉండాలి... లేకుంటే నొప్పులు ఎక్కువవుతాయి
Read Also: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 21 Dec 2021 08:28 PM (IST) Tags: Egg Recipes snacks recipe Simple Egg snacks కోడిగుడ్డు కబాబ్స్ Egg kebabs

సంబంధిత కథనాలు

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?

జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?

Raksha Bandhan 2022 Wishes: రక్షా బంధనానికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పేయండిలా

Raksha Bandhan 2022 Wishes: రక్షా బంధనానికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పేయండిలా

Diabetes: ఈ అయిదు ఆహారాలు రోజూ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉండడం ఖాయం

Diabetes: ఈ అయిదు ఆహారాలు రోజూ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉండడం ఖాయం

Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే

Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే

టాప్ స్టోరీస్

Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !

Gorantla Madhav Issue :  వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం -  ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ  !

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక