Periods: నెలసరి సమయంలో వీటికి దూరంగా ఉండాలి... లేకుంటే నొప్పులు ఎక్కువవుతాయి
నెలసరి సమయంలో తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
నెలసరి అందరి స్త్రీలకు ఒకేలా ఉండదు. కొందరికి కడుపునొప్పి, కొందరికి అధిక రక్తస్రావం, మరికొందరికి నడుమునొప్పి, పొత్తి కడుపులో తీవ్ర పోటు... ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరికి ఎలా ఉన్నా కూడా... నెలసరి సమయంలో తినకూడని పదార్థాలు ఉన్నాయి. వాటిని తింటే నొప్పులు పెరగడమే కాదు, రక్త స్రావం కూడా అధికమైపోతుంది. దీనివల్ల రక్త హీనత సమస్య రావచ్చు.
1. బొప్పాయి
బొప్పాయి పండు ఆరోగ్యకరమైనదే కానీ, నెలసరిలో తింటే మాత్రం అధిక రక్తస్రావం అవుతుంది.
2. నువ్వులు
సాధారణ రోజుల్లో నువ్వులు చాలా శక్తివంతమైనవి. కానీ రుతుస్రావం సమయంలో మాత్రం అధిక రక్తస్రావానికి కారణం అవుతాయి.
3. కూల్ డ్రింకులు
నెలసరి సమయంలో వీటిని తాగడం వల్ల నడుము నొప్పి, కడుపు నొప్పి వంటివి ఎక్కువవుతాయి.
4. ఉప్పు
ఆహారం ఉప్పును తగ్గించడం చాలా మంచిది. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆడవాళ్లు నెలసరిలో తగ్గించాలి. లేకుంటే కడుపు ఉబ్బరంలాంటివి ఎక్కువవుతాయి.
5. కాఫీ, టీ
కాఫీ, టీలు అధికంగా తాగే అలవాటు ఉంటే ఆ మూడు రోజులు లేదా అయిదు రోజులు పూర్తిగా తాగడం మానేయండి. వీటిలో ఉండే కెఫీన్ రక్తనాళాలను కుచించుకుపోయేలా చేస్తుంది. గర్భాశయానికి వెళ్లే రక్తనాళం సంకోచించి పొత్తికడుపు నొప్పి పెరుగుతుంది.
6. కొవ్వు పదార్థాలు
అధికంగా కొవ్వులుండే ఆహారాలను తినకపోవడం ఉత్తమం. నెలసరి సమయంలో మాంసాహారం, పాలతో చేసిన ఉత్పత్తులు తగ్గించాలి. ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్ ను ప్రేరేపిస్తాయి. ఫలితంగా మూడు స్వింగ్స్ , ఒళ్లు నొప్పులు.
పైన చెప్పినవన్నీ ఓ మూడు రోజుల పాటూ బంద్ చేస్తే మీ నెలసరి సక్రమంగా, నొప్పి లేకుండా సాగిపోతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read Also: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?
Read Also: కాఫీని ఇలా తాగితే బరువు తగ్గిపోతారు... ప్రయత్నించండి
Read Also: నందిత బన్నా... శ్రీకాకుళం అమ్మాయి మిస్ సింగపూర్ అయింది, మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది
Read Also: నిద్రలో మీకు ఈ రెండు సమస్యలు ఉన్నాయా... చాలా డేంజర్ అంటున్న కొత్త అధ్యయనం
Read Also: 2021 Trend: 2021లో విటమిన్ సి ఎందుకు అంతగా ట్రెండయ్యింది? అందాన్ని కాపాడే విటమిన్ ఇదొక్కటేనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి