Nanditha Banna: నందిత బన్నా... శ్రీకాకుళం అమ్మాయి మిస్ సింగపూర్ అయింది, మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది
సింగపూర్‌లో తన అందంతో మతులు పోగొడుతోంది ఓ తెలుగమ్మాయి.
నందిత బన్నా... అచ్చ తెనుగు పేరు. సింగపూర్లో ట్రెండవుతున్న పేరు ఇది. ఈ అందాల భరిణ ‘మిస్ యూనివర్స్ సింగపూర్ 2021’గా ఎంపికైంది. కానీ మనకు మాత్రం ఈ పేరు తెలియదు. ఈ ఏడాది సెప్టెంబరులోనే మిస్ సింగపూర్ గా ఎంపికై, ఆ తరువాత ఇజ్రాయెల్‌లో జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో కూడా పాల్గొంది. ఈ పోటీల్లో సెమీ పైనల్స్ దాకా వెళ్లగలిగింది. అక్కడే ప్రయాణం ఆగిపోయినా చాలా స్పూర్తివంతంగా వెనుదిరిగింది. గత 34 ఏళ్లలో ఒక్కరు కూడా సింగపూర్ నుంచి అంతర్జాతీయ అందాల పోటీలలో సెమీ ఫైనల్స్ దాకా వెళ్లలేదు. ఇప్పుడు నందిత ఆ బారియర్స్ ను బద్దలు కొట్టింది. మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లొచ్చాక నందితకు సింగపూర్లో మామూలు ఫాలోయింగ్ లేదు.
పుట్టిందే సింగపూర్లో...
అచ్చతెనుగు పేరు పెట్టుకున్న అమ్మాయి మిస్ సింగపూర్ గా ఎలా ఎంపికైంది అని సందేహం రావచ్చు. నిజానికి నందిత అమ్మానాన్న పెళ్లవ్వగానే సింగపూర్ వెళ్లిపోయారు. అక్కడే వారికి ఈ అందాల కూతురు పుట్టింది. వారికి సింగపూర్ పౌరసత్వం కూడా ఉంది. నందిత అక్కడే పుట్టడంతో ఆమె సింగపూర్ పౌరురాలు అయిపోయింది. ప్రస్తుతం 21 ఏళ్ల నందిత గ్రాడ్యుయేషన్ చదువుతోంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు ఈ అందగత్తె. కారణం ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారట. అంతేకాదు తెలుగు సినిమాలను ఫాలో అవుతుంది నందిత. భవిష్యత్తులో సినిమాల సంగతి చెప్పలేను కానీ, మోడలింగ్ వైపు వెళ్తానని మాత్రం చెబుతోంది.
తల్లిదండ్రులది శ్రీకాకుళం...
నందిత తల్లిదండ్రులు మాధురి, గోవర్ధన్. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా. నందిత ఆంగ్లంతో పాటూ తెలుగు, హిందీ మాట్లాడగలదు. ఉద్యోగం కోసం ఆమె తండ్రి సింగపూర్ వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇంట్లో తరచూ తెలుగు సినిమాలను చూస్తుంటారు.
View this post on Instagram
Read Also: అందమా అందమా.. టైటిల్ అందకుంటే న్యాయమా.. భారత్ నుంచి మిస్ వరల్డ్ విజేతలు వీరే..
Read Also: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్
Read Also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read Also: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం
Read Also: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి