Viral News: భర్త అసహజ శృంగారం - మధ్యలోనే భార్య మృతి - నిర్దోషిగా రిలీజ్ చేసిన హైకోర్టు
Chhattisgarh high court:: భార్యతో అసహజ శృంగానికి ఓ భర్త ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఆమె చనిపోయింది. అతని తప్పేం లేద నికోర్టు చెప్పింది.

Woman dies of husband sexual act HC cites marital rape ground to acquit him: భార్య అనుమతి లేకుండా శృంగారం చేయడమే కాదు.. తన విపరీత లైంగిక కోరిక కారణంగా అసహజ శృంగారానికి ప్రయత్నించడంతో భార్య చనిపోయింది. అయితే అతను మాత్రం తాను హత్య చేయలేదని.. శృంగారం మాత్రమే చేయబోనని వాదించాడు. ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. నిర్దోషిగా విడుదల చేసింది.
చత్తీస్ ఘడ్‌లో ఓ నలబై ఏళ్ల వ్యక్తి తన బార్య మరణానికి కారణం అయ్యాడు. అతను తన భార్యను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేయలేదు. ఆమెకు ఇష్టం లేకపోయినా అసహజ శృంగారానికి ప్రయత్నించాడు. ఎలాంటి శృంగారం చేయాలని ప్రయత్నించాడో కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. అతనిపే కేసు నమోదు చేశారు. జగదల్‌పూర్‌లోని అదనపు సెషన్స్ జడ్జి ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించి, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఆ వ్యక్తి తరువాత దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ వ్యక్తి బిలాస్‌పూర్‌లోని హైకోర్టును ఆశ్రయించాడు.
సుదీర్ఘ విచారణలో భార్యకు ఇష్టం లేకుండా తనతో అసహజ శృంగారం లాంటివి చేయడాన్ని నేరంగా భావించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పును వెలువరించింది. లైంగిక సంబంధం లేదా అసహజ శృంగారం విషయంలో భార్య 'సమ్మతి' లేదని నేరంగా పరిగణించలేమని చెప్పింది. అసహజ లైంగిక సంబంధం విషయంలో మహిళ మరణించినా కూడా తీర్పు ఇలా ఇవ్వడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
నిజానికి భార్యభర్తల బంధంలో అత్యాచారం అనే ప్రస్తావన వస్తే కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమవుతుందని కేంద్రం గతంలో ఇలాంటి కేసుల్లో తన అభిప్రాయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పింది. భార్య అయినా మైనర్ గా ఉంటే మాత్రం శృంగారం చేస్తే అత్యాచారమే అవుతుందని చెప్పింది. మేజర్ అయితే అత్యాచారంగా చెప్పాల్సిన పని లేదన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు పలు చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారమే చత్తీసీ ఘడ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ అసహజ శృంగారం చేస్తూండగా భార్య చనిపోయినా.. భర్తను నిర్దోషిగా ప్రకటించడంపై మాత్రం విస్మయం వ్యక్తమవుతోంది.
మారిటల్ రేప్ అంశంపై సమాజంలోనే చాలాకాలంగా చర్చ జరుగుతోంది. భార్య భర్తల మధ్య శృంగారం అనేది సహజమని.. ఒక వేళ భార్య..తన భర్తతో విబేధాలు వచ్చిన తర్వాత తనపై అత్యాచారం చేశారని కేసు పెడితే అది చాలా ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందన్నది కొంత మంది వాదన. అయితే భార్య అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని పట్టుకోవడం.. లైంగిక వేధింపులకు పాల్పడం అంటే ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుందని ఫెమినిస్టులు వాదిస్తున్నారు. కానీ తొలిసారిగా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు భార్య చనిపోయిన ఘటనతో ఈ అంశంపై మరింత చర్చ జరగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

