Viral News: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో
Insane scene: బిగ్ బాస్ తరహా ప్రోగ్రాంలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. స్పెయిన్ లోనూ ఒకటి జరుగుతోంది. ఆ షోలో జరిగిన ఓ డ్రామా ఇప్పుడు ప్రపంచం మొత్తం వైరల్ వీడియోగా మారింది.

Insane scene on reality TV Spanish show : ఓ ఇల్లు ఉంటుంది. అందులోకి పదో.. పదిహేను మందో పోటీదారుల్ని పంపుతారు. కలిసి ఉండమంటారు. ఫోన్లు సహా ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరి కదలికలు.. బాత్ రూంలో ఉన్న సమయం మినహా అన్ని కదలికలు రికార్డు చేస్తారు. ఇది మనకు తెలిసిన బిగ్ బాస్ షో. కానీ ఇతర దేశాల బిగ్ బాస్‌లు చాలా అడ్వాన్సుడుగా ఉంటాయి. ఓ బీచ్ ఒడ్డున అడవిలో బిగ్ బాస్ ఇంటిని నిర్మించి అక్కడ ప్రేమికుల జంటల్ని వదిలి పెట్టే షో స్పానిష్ లో ఉంది. ఇందులో జరిగిన ఓ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
స్పానిష్ టీవీ షోల్లో నటించే మెంటాయా అనే నటుడుకి మంచి ఇమేజ్ ఉంది. అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరూ కలిసి ఈ బిగ్ బాగ్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఇలా మరికొన్ని జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి ఇతర పనులు చేయకూడదు. చేస్తే రికార్డవుతుంది. వఎంజాయ్ చేయవచ్చు. ఇలా అందరూ హాయిగా కలసి మెలిసి ఉన్న సమయంలో ఓ రోజు.. మెంటాయా.. తన గర్ల్ ఫ్రెండ్ కాకండా మరో అమ్మాయి రాత్రి పూట అలా షికారుకు వెళ్లారు. విషయం ఏమిటంటే.. ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసేందుకు వారు తిరిగే చోట టీవీలుకూడా పెడతారు. అలా వీరు వెళ్లిన సమయంలో ఓ టీవీ ఉంది.
this is CINEMA…Montoya..the tension… you don’t need to speak spanish to understand, this is insane https://t.co/2sYZA8jBSM
— 2000s (@PopCulture2000s) February 4, 2025
ఓ సీసీ టీవీ ఫుటేజీ చూసి అతనికి మైండ్ బ్లాంక్ అయింది. తన గర్ల్ ఫ్రెండ్ ఉన్న గదిలోకి మరో మేల్ కంటెస్టెంట్ వెళ్లాడు. వెళ్తే ఏముందిలే అనుకోవడం లేదు.. ఇద్దరూ కలిసి గేమ్ ప్రారంభించారు. ఆ గేమ్ చూసి మెంటాయా తట్టుకోలేకపోయాడు. పరుగులు పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. కానీ ఆ గేమ్ కంప్లీట్ అయ్యే వరకూ వాళ్లు తలుపులు తీయలేదు. దాంతో మెంటాయాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
MONTOYA PART 2….THE DRAMA pic.twitter.com/vkajX6zsBB
— 2000s (@PopCulture2000s) February 5, 2025
మెంటాయాకు ఆమె నిజంగానే గర్ల్ ఫ్రెండ్. జీవితాంతం తనతోనే ఉంటుదంనుకున్న మెంటాయో.. తను కాసేపు పక్కన లేకపోవడంతో చేసిన పని చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెంటాయా అంతకు ముందు మరో కాంటెస్టెంట్ తో కలిసి ల్యాబ్ డాన్స్ చేశాడని అతనికి అలా జరగడంలో.. అతని గర్ల్ ఫ్రెండ్ అలా చేయడంలో తప్పు లేదని కామెంట్స్ పెడుతున్నారు.





















