Tesla Car: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి

ఎలన్ మస్క్ కలల కారు టెస్లా. ఆ కారుకి అభిమానులు ఎక్కువే.

FOLLOW US: 

టెస్లా కారు వాడాలని కార్ లవర్స్ లో చాలా మంది కల. ఈ కారు అద్భుతమైన ఫీలర్లతో ఆకట్టుకుంటుంది. ఎలన్ మస్క్ చేసిన అద్భుతమైన ఆవిష్కరణలలో టెస్లా కారు ప్రత్యేకం. అలాంటి టెస్లా కారునే ఓ వ్యక్తి పేల్చి పిప్పి చేశాడు. ఎనిమిదేళ్ల నుంచి వాడుతున్న కారు రిపేరుకు రావడంతో ఇలా పేల్చి వేసినట్టు చెబుతున్నాడు. ఈ పేల్చివేత కార్యక్రమం మొత్తం ఓ యూట్యూబ్ ఛానెల్ వారు డాక్యుమెంటరీ రూపంలో తీశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెస్లా కారును పేల్చేసిన విషయం పాకిపోయింది. 

టౌమస్ కెటెనిన్... ఫిన్లాండ్‌కు చెందిన వ్యక్తి. ఎనిమిదేళ్లుగా టెస్లా కారును వాడుతున్నాడు. ఆ కారులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో అనేక ఎర్రర్ కోడ్‌లు వంటి సమస్యలను తాను ఎదుర్కొన్నానని చెబుతున్నాడు టౌమస్. ఆ కారును టెస్లా సర్వీస్ సెంటర్ కి పంపించినట్టు చెప్పాడు. ఒక నెల తరువాత టెస్లా మెకానిక్‌లు కారును రిపేర్ చేసేందుకు రూ.17 లక్షల రూపాయలు ఖర్చువుతుందని చెప్పారు. మొత్తం బ్యాటరీ ప్యాక్ నే మార్చాలని వారు తెలిపారు. దీంతో టౌమస్ కు చాలా కోపం వచ్చింది. రిపేరుకే అంత ఖర్చవుతుంటే ఇలాంటి కారు ఉంచుకోవడం అవసరమా అనిపించింది. అందులోనూ కారు వారంటీ కూడా ముగిసిపోయింది. దీంతో టెస్లా సంస్థపై అసంతృప్తిని తెలియజేసేందుకు కారును పేల్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిన్‌ల్యాండ్లోని వాతావరణం మంచుతో కప్పుకుని ఉంటుంది. ఒక మారుమూల గ్రామానికి కారుని తీసుకెళ్లి అక్కడ పేల్చివేయాలని ప్లాన్ వేశాడు. ఆ విషయం ఒక యూట్యూబ్ ఛానెల్ వారికి తెలిసి వారు టౌమస్ అనుమతి తీసుకుని మొత్తం షూట్ చేశారు. 

30 కిలోల డైనమైట్లతో...
కారును పిప్పి చేసేందుకు 30 కిలోల డైనమట్లను కొనుగోలు చేశాడు టౌమస్. వాటిని కారు చుట్టు పేర్చాడు. అంతేకాదు ఎలన్ మస్క్ ముఖంతో ఓ బొమ్మను తయారుచేసి అందులో కూర్చోబెట్టాడు. క్షణాల్లో ఆ కారును పేల్చి వేశాడు. తెల్లటి కారు నల్లటి పొగల మధ్య చెరకుపిప్పిలా మారిపోయింది.  అసంతృప్తిని, కోపాన్ని ప్రదర్శించడంలో ఇది ఇతడి స్టైల్ అంటూ కామెంట్లు మొదలయ్యాయి యూట్యూబ్ లో. 

Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
Read Also: నెలసరి సమయంలో వీటికి దూరంగా ఉండాలి... లేకుంటే నొప్పులు ఎక్కువవుతాయి
Read Also:  బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?
Read Also:  కాఫీని ఇలా తాగితే బరువు తగ్గిపోతారు... ప్రయత్నించండి
Read Also:  నందిత బన్నా... శ్రీకాకుళం అమ్మాయి మిస్ సింగపూర్ అయింది, మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Dec 2021 08:42 AM (IST) Tags: Tesla car Dynamite Blows up car టెస్లా కార్

సంబంధిత కథనాలు

Generic Medicine: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే

Generic Medicine: జనరిక్ మందులు అంటే ఏమిటో తెలుసా? అవెందుకు తక్కువ ధరకే దొరకుతాయంటే

Sadguru And Honey: తేనెను ఎలా వాడితే విషపూరితమవుతుందో చెప్పిన సద్గురు, ఇలా తింటే సేఫ్

Sadguru And Honey: తేనెను ఎలా వాడితే విషపూరితమవుతుందో చెప్పిన సద్గురు, ఇలా తింటే సేఫ్

Foods for Kidneys: అధ్యయనాల ప్రకారం కిడ్నీల కోసం మీరు తినాల్సిన ఆహారాలు ఇవే

Foods for Kidneys: అధ్యయనాల ప్రకారం కిడ్నీల కోసం మీరు తినాల్సిన ఆహారాలు ఇవే

Wife Throws Boiling Water: భర్త కలలోకి మరో మహిళ, జననాంగాలపై మరిగిన నీళ్లుపోసిన భార్య!

Wife Throws Boiling Water: భర్త కలలోకి మరో మహిళ, జననాంగాలపై మరిగిన నీళ్లుపోసిన భార్య!

Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

టాప్ స్టోరీస్

MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

Raghurama Krishna Raju: ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు, ఆయన కుమారుడిపై కూడా

Raghurama Krishna Raju: ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు, ఆయన కుమారుడిపై కూడా

Congress MP Pen Theft: ఎంపీ జేబులో పెన్ను మిస్సింగ్! కలం కోసం కంటతడి, ఎంపీని ఓదార్చిన సన్నిహితులు-ధర ఎంతో తెలుసా?

Congress MP Pen Theft: ఎంపీ జేబులో పెన్ను మిస్సింగ్! కలం కోసం కంటతడి, ఎంపీని ఓదార్చిన సన్నిహితులు-ధర ఎంతో తెలుసా?

Editor Gautham Raju: టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత

Editor Gautham Raju: టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత