Corona Omicrona Updates: తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు....ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, టీఎస్ లో 140
తెలంగాణలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 41కి చేరాయి. ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 140 కోవిడ్ కేసులు వచ్చాయి.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 333 మంది శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారందరికీ కోవిడ్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయగా ఎనిమిది మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు అధికారులు.
Also Read: రాజస్థాన్ లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు!
తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో కొత్తగా 140 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 4,021కు చేరింది. కరోనా నుంచి నిన్న 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
ఏపీలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 28,209 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 104 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,489కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 133 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,672 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1249 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: As on 25th December, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 25, 2021
COVID Positives: 20,73,515
Discharged: 20,57,777
Deceased: 14,489
Active Cases: 1,249#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iZ5DGR6wzF
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,410కి చేరింది. గడచిన 24 గంటల్లో 133 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1249 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,489కు చేరింది.
Also Read: ఐటీఆర్ ఫైల్ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్!!