అన్వేషించండి
Amazon Alexa on Covid Testing: హే అలెక్సా.. కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడున్నాయి?
అలెక్సా
1/5

కోవిడ్ 19 సంబంధించిన సమాచారం అందించేందుకు అమెజాన్ సంస్థకు చెందిన వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయపడనుంది. మనకు సమీపంలో టెస్టింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి.. వ్యాక్సినేషన్ సెంటర్లు వివరాలు ఏంటి అనేక విషయాలను వెల్లడించనుంది. ఇది కేవలం భారత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.
2/5

అలెక్సా కోవిడ్ -19 సంబంధిత సమాచారం అందించడంలో సహాయపడుతుందని అమెజాన్ ఇండియా సంస్థ వెల్లడించింది. అలెక్సాలో ఉండే వర్చువల్ అసిస్టెంట్ ద్వారా మనకు సమీపంలో ఉన్న కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు, వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పింది.
3/5

వీటితో పాటుగా కోవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లు, వ్యాక్సినేషన్ గురించిన ప్రశ్నలకు అలెక్సా సమాధానాలు ఇస్తుందని తెలిపింది. 2020లో కోవిడ్ లక్షణాలు, కేసుల గురించిన సమాచారాన్ని అలెక్సా అందించిందని గుర్తు చేసింది.
4/5

అలెక్సా అందించే సమాచారం అంతా.. కోవిన్ (CoWIN) పోర్టల్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లతో పాటు మ్యాప్మీ ఇండియా (MapmyIndia) ల నుంచి తీసుకుంటుందని అమెజాన్ తెలిపింది.
5/5

అదండి సంగతి. సో ఇకపై మీరు కూడా ఎంచక్కా 'హే అలెక్సా... నాకు దగ్గరలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడున్నాయో చెప్పు? అలెక్సా.. కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు దగ్గర్లో ఎక్కడున్నాయి?..' అని అడిగేయండి.
Published at : 05 Aug 2021 06:58 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















