Omicron Cases: రాజస్థాన్ లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ఉంది. 

FOLLOW US: 

ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్.. దేశంలోనూ.. విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే.. రాజస్తాన్ లో 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరుకుంది. అయితే ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి ఒమిక్రాన్ సోకింది. రాజస్థాన్ లో మెుత్తం 43 కేసులు నమోదు కాగా.. అందులో 28 కేసులు.. జైపుర్ లోనివే. అజ్మేర్‌లో 7, సికర్‌ 4, ఉదయ్‌పుర్‌లో 3 కేసులు నమోదయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దేశంలో మెుత్తం వేరియంట్ల సంఖ్య 437కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు ఉన్నాయి. ఢిల్లీ 79, గుజరాత్‌ 43 కేసులు బయటపడ్డాయి.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించాలని చెప్పింది.  మరోవైపు వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతో పాటు ఆంక్షలు విధిస్తున్నాయి. అసోం ప్రభుత్వం శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ఈ ఆంక్షలను మినహాయింపునిచ్చారు.

కర్ణాటకలో వైద్య విద్యార్థులకు కరోనా

కర్ణాటక రాష్ట్రంలో కరోనా కలకలం రేపింది. కోలార్ శ్రీ దేవరాజ్ ఉర్స్ మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. విద్యార్థుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారని జిల్లా సర్వైలెన్స్ అధికారిణి డాక్టర్ చరణి తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థుల ప్రయాణ హిస్టరీలేదని తెలుస్తోంది. అయితే బెంగళూరులో ప్రయాణం ఆరా తీస్తున్నట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. కళాశాల యాజమాన్యం ప్రకారం గత 45 రోజులుగా ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులెవరూ స్వగ్రామాలకు వెళ్లలేదని డాక్టర్ చరణి తెలిపారు. విద్యార్థులు ఉంటున్న బ్లాక్ మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైద్య విద్యార్థులందరినీ ఆర్‌ఎల్‌ జలప్ప ఆసుపత్రిలో ఐసోలేట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. కోవిడ్ సోకిన విద్యార్థుల ప్రైమరీ, సెంకండరీ కాంటాక్ట్ర్  1192 లను గుర్తించామని వైద్యులు తెలిపారు. 

Also Read: Karnataka Corona Cases: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Also Read: Agriculture Laws: అయిపోలేదు.. ఇంకా ఉంది.. వ్యవసాయ చట్టాలు మళ్లీ తెస్తాం .. కేంద్రమంత్రి కీలక ప్రకటన !

Also Read: ITR Filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్‌!!

Published at : 25 Dec 2021 06:28 PM (IST) Tags: Corona covid 19 India omicron cases Rajasthan Omicron Cases 21 new corona cases

సంబంధిత కథనాలు

Viral News : టీవీ పెట్టిన చిచ్చు, రీఛార్జ్ చేయించలేదని విడాకులు కోరిన భార్య!

Viral News : టీవీ పెట్టిన చిచ్చు, రీఛార్జ్ చేయించలేదని విడాకులు కోరిన భార్య!

Viral Video : సాఫ్ట్‌వేర్ కన్నా స్పీడ్ - ఈ రైల్వే ఎంప్లాయి ఇప్పుడు సోషల్ మీడియాకు హాట్ ఫేవరేట్

Viral Video : సాఫ్ట్‌వేర్ కన్నా స్పీడ్ - ఈ రైల్వే ఎంప్లాయి ఇప్పుడు సోషల్ మీడియాకు హాట్ ఫేవరేట్

Shiv Sena MP Sanjay Raut: షిండే శిబిరం నుంచి నాకూ ఆఫర్ వచ్చింది, మభ్యపెడితే లొంగిపోను-సంజయ్ రౌత్

Shiv Sena MP Sanjay Raut: షిండే శిబిరం నుంచి నాకూ ఆఫర్ వచ్చింది, మభ్యపెడితే లొంగిపోను-సంజయ్ రౌత్

Maharashtra Politics: ప్రధాని మోదీ ఫోన్‌ కాల్, మాట కాదనలేకపోయిన ఫడణవీస్

Maharashtra Politics: ప్రధాని మోదీ ఫోన్‌ కాల్, మాట కాదనలేకపోయిన ఫడణవీస్

Chemist Murder: నుపుర్ శర్మకు లుకౌట్‌ నోటీసులు జారీ, రెండు ఎఫ్‌ఐఆర్ కేసులు నమోదు

Chemist Murder: నుపుర్ శర్మకు లుకౌట్‌ నోటీసులు జారీ, రెండు ఎఫ్‌ఐఆర్ కేసులు నమోదు

టాప్ స్టోరీస్

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!

New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!

New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్