Anna Canteen Checking: అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ శాఖ కమిషనర్, తర్వాత ఏం జరిగింది..
Andhra Pradesh News | మున్సిపల్ శాఖ కమిషనర్ సంపత్ కుమార్ ఒంగోలులో ఓ అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసి నాణ్యత పరిశీలించారు.

Municipal Commissioner inspection at Anna Canteen in Ongole | ఒంగోలు: కూటమి ప్రభుత్వం తక్కువ ధరకు పేదవాడి కడుపు నింపేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కీమ్ అన్న క్యాంటీన్. మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్, ఐఏఎస్ సంపత్ కుమార్ ఒంగోలులో అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒంగోలులోని ట్రాన్స్ కో ఆఫిస్ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను సంపత్ కుమార్ పరిశీలించారు. అన్న క్యాంటీన్ లో శనివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నారు. ఆహార నాణ్యతను స్వయంగా తిని తెలుసుకున్నారు మున్సిపల్ శాఖ డైరెక్టర్.
తనిఖీ తరువాత సంతృప్తి వ్యక్తం చేసిన మున్సిపల్ శాఖ కమిషనర్
అన్న క్యాంటీన్ లో ఆహారం చాలా బాగుందని మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ మెచ్చుకున్నారు. అన్న క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్ సిబ్బందికి జీతాలు సకాలంలో అందుతున్నాయా లేదా, వారికి ఏమైనా సమస్యలు అని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ కు అల్పాహారం కోసం వచ్చిన వారితో మాట్లాడి. ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం లభించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నా క్యాంటీన్ పథకం
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 సెప్టెంబర్ 2018న ప్రారంభించిన సబ్సిడీ ఆహార సేవా కార్యక్రమం అన్నా క్యాంటీన్. 1983లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కిలోకు రూ.2 చొప్పున సబ్సిడీ బియ్యాన్ని ప్రవేశపెట్టారు. దాంతో ఆయన తీసుకొచ్చిన కార్యక్రమానికి కొనసాగింపుగా.. చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ స్కీమ్ మొదలుపెట్టింది. ₹5 సబ్సిడీ రేటుతో భోజనం అందిస్తున్నారుు. దాతల సహకారంతో ఏపీ ప్రభుత్వం అల్పాహారం, భోజనం రూ.5కు అందిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్లను బంద్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక స్కీమ్ మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఆగస్టు 15, 2024న అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు.
Also Read: AP Bird Flu Tension: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

