AP Bird Flu Tension: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్
Bird Flu In Humans | ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి సత్య కుమార్ స్పందించారు. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం నిజం కాదని స్పష్టం చేశారు.

Bird Flu Cases In Andhra Pradesh | అనంతపురం: ఏపీలో పలు జిల్లాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో తూర్పు గోదావరి జిల్లాలో వేలాదిగా కోళ్లు చనిపోయాయి. మరికొన్ని జిల్లాల్లోనూ కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఏపీలో మనుషులకు సైతం బర్డ్ ఫ్లూ సోకిందని ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రజలు చికెన్ జోలికి అంతగా వెళ్లడం లేదు. కొన్ని చోట్ల చికెన్ తినడం తాత్కాలికంగా మానేశారు.
మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందనేది కేవలం వదంతులు మాత్రమేనని ఏపీ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనుషులకు సోకుతునన గులియన్ బారే సిండ్రోమ్ అనే నరాల వ్యాధిపై నిరంతరం సమీక్షిస్తున్నాం. కానీ మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందనేది వదంతులేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ పై చర్చ నడుస్తోంది. వికసిత్ భారత్ కల సాకారమయ్యే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. యూరియాపై రాయితీ పెంచేలా చర్యలు తీసుకున్నామని సత్యకుమార్ పేర్కొన్నారు.
కర్నూలులో రెడ్ అలర్ట్
రాయలసీమలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ తరువాత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు తేలిన తర్వాత జిల్లా అధికారులు నర్సింహారెడ్డి నగర్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని నివారించడానికి పర్యవేక్షణతో పాటు నియంత్రణ చర్యలు చేపట్టారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్యారోగ్య, పశుసంవర్ధక శాఖలు శుక్రవారం బర్డ్ ఫ్లూ కేసు గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాతో పరిస్థితిపై చర్చించిన ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

