Gautam Gambhir | KKrR vs SRH Qualifier 1 Highlights | కోల్‌కతా ను మళ్లీ నిలబెట్టిన గంభీర్ | ABP
ఎవరు ఔనన్నా కాదన్నా... కోల్ కతా తలరాతను మార్చింది గౌతమ్ గంభీర్. 2011లో కెప్టెన్ గా... ఇప్పుడు మెంటర్ గా కేకేఆర్ పని ఐపోయిందనుకున్న ప్రతిసారి కేకేఆర్ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశాడు.
ఎవరు ఔనన్నా కాదన్నా... కోల్ కతా తలరాతను మార్చింది గౌతమ్ గంభీర్. 2011లో కెప్టెన్ గా... ఇప్పుడు మెంటర్ గా కేకేఆర్ పని ఐపోయిందనుకున్న ప్రతిసారి కేకేఆర్ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశాడు. 2011లో తొలిసారి కేకేఆర్ ను ప్లే ఆఫ్స్ తీసుకెళ్లాడు. అదేదో గాలివాటం కాదని నిరూపిస్తూ... 2012 సీజన్ లో కేకేఆర్ కు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. 2 ఏళ్లకే అంటే 2014లోనే మరోసారి కేకేఆర్ కు ట్రోఫీ అందించాడు. 2016,17లోనూ కేకేఆర్ ను ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. అలా.. 2011 నుంచి 2017 వరకు 6 ఏళ్లు కెప్టెన్ గా వ్యవహరించి కేకేఆర్ ను బలమైన టీమ్ గా నిలిపాడు. కెప్టెన్ అంటే బ్యాటింగ్ ఆడటమే కాదు.. పదునైనా వ్యుహాలు వేసి ఫలితం రాబట్టాడు. సునీన్ నరైన్ ను ఓపెనర్ గా పంపించడం..రసూల్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చి కేకేఆర్ కు బ్యాక్ బోన్ గా మలచడం.. రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ ల కమ్ బ్యాక్ ఇలా.. అన్నింట్లో గంభీర్ వ్యుహాలు ఫలించాయి. ఆ తరువాత సొంత గడ్డైన దిల్లీ క్యాపిటల్స్ కోసం గంభీర్ కేకేఆర్ ను వదిలిపెట్టిన తరువాత...2021లో రన్నరప్ గా నిలిచిన కేకేఆర్ ఇంకే సీజన్ లోనూ ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టలేదు. ఈ సీజన్ లో కేకేఆర్ మెంటర్ గా గంభీర్ రావడంతో..మళ్లీ కథ మారింది. ఇన్నాళ్లు బౌలర్ గా ఉన్న నరైన్ మళ్లీ ఓపెనర్ అవతారమెత్తి.. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. రసూల్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. టీం ఇండియా స్టార్స్, ఫారెన్ స్టార్ ప్లేయర్స్ లేకున్నా... ఉన్న వాళ్ల నుంచే 100శాతం రాబట్టడంలో గంభీర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. గ్రౌండ్ లో అతడి ప్రభావం కేకేఆర్ ఆటగాళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే... ఈ సీజన్ లో కేకేఆర్ ఫైనల్ లో అడుగుపెట్టిందంటే దానికి గల ప్రధాన కారణాల్లో గంభీర్ ఒకరు. క్రికెట్ పై.. ఆటగాళ్ల ప్రదర్శనలపై ఇంత క్లారిటీగా ఉండే గంభీర్ టీం ఇండియా హెడ్ కోచ్ ఐతే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.