Weather Latest Update: నేడు, రేపు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్: ఐఎండీ
Hyderabad Weather News: హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
Weather Latest News: ఆగస్టు 7న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న గంగేటిక్ పశ్చిమ బెంగాల్, పరిసర బాంగ్లాదేశ్ ప్రాంతంలో కొనసాగిన ఆవర్తనం ఈరోజు గాంగ్ టక్ పశ్చిమ బెంగాల్, పరిసర ఝార్ఖండ్ - ఉత్తర ఒడిశా వద్ద సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపుకు వంగి వున్నది.
ఉత్తర - దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నది. ప్రధానంగా క్రింది - స్థాయి గాలులు పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల, రేపు చాలాచోట్ల మరియు ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఈ రోజు, రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.
నేడు ఉరుములు, మెరుపుల, ఈదురుగాలుల వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా నమోదైంది. 84 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ పై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి, ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం గుండా కొమోరిన్ ప్రాంతం వరకు ఉంది.
ఆగస్టు 7న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.