By: ABP Desam | Updated at : 16 Mar 2023 12:55 AM (IST)
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా బుధవారం నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలోని దుబ్బ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.
నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుంది. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుంది. నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారు. నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందే. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్.
ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామి కాదా? అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగింది. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడు. పెద్ద మనిషి స్థానంలో ఉన్న స్పీకర్ పోచారం.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండు అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన జేబులో ఉన్నాడన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు? ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది. ఆయన పనిలో అధర్మం కనిపిస్తుంది. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారని రేవంత్ గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ వరాల జల్లులు..
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు రేవంత్ రెడ్డి.
దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితులకు దోచి పెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమైతే 819 శాతం ఆదానీ ఆస్తుల విలువ పెరిగిందన్నారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ దేశ సంపదను ఆదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. దీనిపై రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చారని అన్నారు.
Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన
TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?
Biometric Attendance: ఇక ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!
Nizamabad: నిజామాబాద్‌లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య, మూడు నెలల్లో ఇద్దరు బలవన్మరణం
TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారం, రంగంలోకి ఈడీ? పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందన్న అనుమానం!
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?