News
News
వీడియోలు ఆటలు
X

దేశవ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే CPRపై అవగాహన- మంత్రి హరీశ్ రావు

CPR చేయడం నేర్చుకుని ఆపద్బాంధవులుగా మారండి!

అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌ రావు

FOLLOW US: 
Share:

సీపీఆర్ నేర్చుకుని ప్రతి ప్రాణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు వైద్యఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు. CPR చేయడం వస్తే 50 శాతం మందిని బతికించొచ్చని తెలిపారు. కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సీపీఆర్ విధానం ఎంతో తోడ్పడుతుందని హరీష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉన్నదని, అందుకే సీపీఆర్ ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు  తెలిపారు. సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు మంత్రి సమక్షంలో స్వయంగా సీపీఆర్ చేసి, దాని ప్రాముఖ్యతను వివరించారు. కాగా ఇటీవల సీపీఆర్ చేసి విలువైన ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని మంత్రి ఘనంగా సన్మానించారు.

సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఇంట్లోవాళ్లకే వస్తే ఏం చేస్తాం?

ఎవరిదాకానో ఎందుకు? సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఇంట్లోవాళ్లకే వస్తే ఏం చేస్తాం? కళ్లముందు ఆత్మీయులే పడిపోతే నిన్సహాయతతో ఉండిపోతామా? కుటుంబ సభ్యులకే వస్తే కూలబడిపోతామా? అందుకే సీపీఆర్ నేర్చుకోవడం చాలా అవసరం! ఇదే విషయాన్ని ప్రస్తావించారు మంత్రి హరీష్ రావు. దేశంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 15 లక్షల మంది చనిపోతున్నారని.. రాష్ట్రంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 4 వేల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉందన్నారు. అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీపీఆర్ శిక్షణ కార్యక్రమం చేపట్టిందని హరీష్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని అన్నారు.

ఇప్పటి వరకు18,850 మందికి శిక్షణ

CPRపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు18,850 మందికి శిక్షణ అందిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. అందరూ నేర్చుకుంటే ప్రతి విలువైన ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు. హార్ట్ఎటాక్ వేరు సర్డెన్ కార్డియాక్ అరెస్ట్ వేర్వేరుగా ఉంటాయని.. పలు ఉదాహరణలుగా ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వివరించారు. కార్డియాక్ అరెస్ట్ అంటే.. శ్వాస ఆడకపోవడం, పల్స్ లేకపోవడమని మంత్రి  స్పష్టం చేశారు. రూ.15 కోట్లతో AED మిషనరీలు కొనుగోలు చేసి ఆసుపత్రులలో అందుబాటులోకి తెస్తామన్నారు.  ప్రతీ బ్యాచ్‌లో 20 మంది చొప్పున 1826 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేశారు. మొత్తం 36,500 మందికి శిక్షణ ఇచ్చారు. ఆ మధ్య రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది మహేందర్, రమేష్ కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మోతిరాం మానవత్వం చాటుకున్నారు . సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెడుతున్న వారందరూ కనిపించే దేవుళ్లతో సమానమని హరీష్ రావు ఆ సందర్భంగా ట్వీట్ చేశారు.

Published at : 09 Apr 2023 06:09 PM (IST) Tags: Cardiac Arrest Heart CPR Telangana Harish Rao PULSE

సంబంధిత కథనాలు

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Rains in Telangana: మరో మూడ్రోజులు తెలంగాణలో ఎండావాన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?