Digital Arrests : సైబర్ నేరాల్లో హడలెత్తిస్తున్న డిజిటల్ అరెస్టులు, ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి?
Digital Arrest Telugu: సైబర్ క్రైమ్ నేరాలు జెడ్ స్పీడ్‌తో పెరిగిపోతున్నాయి. ఏకంగా పోలీసు నిర్భంధం పేరుతో చేసే డిజిటల్ అరెస్టలైతే అత్యంత భయానకం. అయితే వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి?
Digital Arrest Case: టెక్నాలజీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో అంతే స్థాయిలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి.. ఒక్కసారి డిజిటల్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది. ఎలా బయటపడాలి అనే అవగాహన అతి తక్కవ మందికి మాత్రమే ఉంది. దీంతో లక్షలాది రూపాయలు మోసపోవడమే కాదు ఒక్కోసారి ప్రాణాలు కోల్పుతున్న ఘటనలు కూడా ఉన్నాయి.
మీ ఫోన్‌కు ఓ తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ లిప్ట్ చేసిన వెంటనే అవతలి వ్యక్తి మీతో మాట్లడుతూ.. మీ పేరుతో ముంబై ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు ఓ పార్సిల్ బుక్ అయిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్తారు. ఇలా ఎప్పటి నుంచి డ్రగ్స్ పంపుతున్నారంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అలా మీతో మాట్లడుతూ మిమల్ని పోలీస్ అధికారులు ఇంట్రాగేట్ చేస్తారు. లైన్‌లో ఉండండి కాల్ కట్ చేయోద్దు, ఎవరికీ చెప్పొద్దంటూ మొదలు పెడతారు. ఈ కాల్ ఏకంగా గంటలు, రోజుల తరబడి సాగుతుంది. మీరు ఓ గదిలోనే బంధిగా, కదలకుండా ఒంటరిగా ఉండేలా చేస్తుంది.
ఈ కాల్‌లోనే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌లో బ్యాలెన్స్ అన్ని తెలుసుకుంటారు నేరగాళ్లు. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యేవరకూ మీతో మాట్లాడుతుంటారు. కేవలం ఫోన్ కాల్‌లో మాట్లడుతూనే పని కానిచ్చేస్తారు. అడిగితే మీరు కదిలితే చిక్కులు తప్పవని హెచ్చరించి అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకుండా చేస్తారు. ఏం చేసినా వీడియో కాల్‌లో ఉండి మాత్రమే చేయాలని షరతులు పెడతారు. చివరకు వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నీ వీడియో కాల్‌లో ఉంటూనే చేయాలి. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు.
పోలీస్ స్టేషన్ అంటనే భయం అందుకే పోలీసు ఉన్నతాధికారులతో భయపెడతారు. డ్రగ్స్ పార్సిల్ అంటూ హడావిడి చేస్తారు. మీకు తెలియి భయాన్ని పరిచయం చేసి దిక్కు తోచని స్థితిలోకి నెట్టేస్తారు. ఇలా ఉక్కిరిబిక్కిరి చేసి నిలువు దోపిడీ చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా లూటీ చేస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే 1930 నెంబర్‌కి కాల్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆ కేటుగాళ్ల సంగతి మేం చూసుకుంటాం అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మోసపోయి తరువాత ఫిర్యాదు చేయడం సరే. ఈ ఫెడెక్స్ కాల్స్ నుంచి మోసపోక ముందే ఎలా తప్పించుకోవాలనేదానిపై తక్కువ మందికే మాత్రమే అవగాహన ఉంది.
ఇలా స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని లిఫ్ట్ చేయకుండా లైట్ తీసుకోవాలని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఒకవేళ లిప్ట్ చేసినా కంగారుపడాల్సి పనిలేదని భరోసా ఇస్తున్నారు. ఏఐ టెక్నాలజీ యుగంలో ఈ డిజిటల్ అరెస్ట్ వెనుకున్నవాళ్లను గుర్తించడం ఎందుకు కష్టంగా మారుతోంది. వీళ్లంతా ఎవరు, ఎక్కడి నుంచి కాల్స్ చేస్తారు. వీరిని పట్టుకోవడం, పోయిన సొత్తు రికవరీ చేయడం ఎందుకు కష్టంగా మారుతోందనే సందేహాలు సర్వసాధారణం. డబ్బు సంపాదించడం చాలా కష్టం, కోల్పోవడానికి నిమిషం చాలు. జాగ్రత్తగా లేకుంటే చేటు తప్పదని అంటున్నారు సైబర్ నిపుణులు. సెల్‌ఫోన్ చేతిలో ఉన్నంత వరకు మనకు ప్రమాదం పొంచి ఉందని సైబర్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ అంటున్నారు. ఏమరపాటుగా ఉంటే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ వాడటమే కాకుండా దాని వల్ల వచ్చే అనర్ధాలపై కూడా కాస్త అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.
'డిజిటల్ అరెస్ట్, సైబర్ కేటుగాళ్లు నార్త్ ఇండియాలోని జామ్ తారా అనే ప్రదేశం నుంచి ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తారు. సాప్ట్ వేర్ కంపెనీ తరహాలో ఇలాంటి మోసగాళ్లకు ట్రైనింగ్ ఇస్తూ బాధితుల నుంచి ఎలా డబ్బులు దోచుకోవాలో, పోలీసు అధికారుల్లా ఎలా మాట్లాడాలో పూర్తి స్దాయి ట్రైనింగ్ ఇస్తారు. గతంలో మీరు షాపింగ్ మాల్ కూపన్స్, లక్కీడ్రా కూపన్స్ కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్లను ఈ సైబర్ నేరగాళ్లకు థర్డ్ పార్టీ ద్వారా చేరిపోతాయి. అందుకే మీ ఫోన్ నెంబర్లు ఇచ్చే ముందు ఓసారి ఈ నేరాలను ద్రుష్టిలో పెట్టుకోవాలి.' అని హెచ్చరిస్తున్నారు.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!